NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

బాలకృష్ణ ఏంటి ఇలా అన్నారు..?? జగన్ తో కలుస్తారా..??

(అనంతపురం నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

సినీ హీరో, టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ అసెంబ్లీలో పెద్దగా మాట్లాడింది ఏమి లేదు. కాకపోతే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పెద్ద మొత్తంలో నిధులు చేయించి పనులు చేయించారనే పేరు ఉంది. అధికార పక్షం వైసిపిపై గానీ, సిఎం జగన్మోహనరెడ్డిపై గానీ ఎన్నికల సమయంలో తప్ప మామూలుగా అయితే విమర్శల జోలికి వెళ్లరు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకూ నందమూరి బాలకృష్ణ ఆయనను వ్యక్తిగతంగా కలిసిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు బాలకృష్ణ తాను సిఎం జగన్ ను కలవనున్నట్లు పేర్కొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు వియ్యంకుడు బాలకృష్ణ ఏమిటీ వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ను కలవడం ఏమిటి అనుకుంటున్నారా? ఇందులో రాజకీయంగా పెద్ద విశేషం ఏమి లేదు.

 

ఎందుకు జగన్‌ను బాలకృష్ణ కలవాలనుకుంటున్నారంటే….

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఇందు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని, అదే మాదిరిగా జిల్లాల స్థాయిలోనూ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురాన్ని అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలకృష్ణ కోరుతున్నారు. హిందూపురం విషయంలో తాను ఎంత దూరమైనా వెళతాననీ, అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కూడా కలిసి కోరతానని బాలకృష్ణ పేర్కొన్నారు.

bala krishnachandrababau

పనిలో పనిగా ప్రభుత్వంపై విమర్శలు

నేడు బాలకృష్ణ హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి 55 లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను అందజేశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో  మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కంటే కక్ష సాధింపు చర్యలే ఎక్కువగా ఉన్నాయని వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శించారు. రాజధాని లేకున్నా టిడిపి హయాంలో తెలంగాణ కంటే అదాయం అధికంగా వచ్చిందన్నారు. రాష్ట్రంలో అందరూ కలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు బాలకృష్ణ. ప్రస్తుత కష్టకాలంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని బాలకృష్ణ  అన్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju