NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అయ్యో పాపం పవన్ ! ఎన్ని చేసినా ‘ఆ ముద్ర’ పోవడం లేదే ??

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాపం ఎన్ని చేసినా ఆయనపై టిడిపి ముద్ర పోవడం లేదు.జనసేనాని ..టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే నడుస్తుంటారని,తెలుగుదేశం పార్టీకి ఆయన ఇప్పటికీ మద్దతుదారుడునేనని ప్రజల్లో కూడా అభిప్రాయం ఉంది.2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేసినప్పటికీ ఆ ప్రచారంలో అప్పుడు అధికారంలో ఉన్న టిడిపిని గాకుండా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీని టార్గెట్ చేయడం జరిగింది.

how much pawan kalyan do, 'that impression' will not go away
how much pawan kalyan do, ‘that impression’ will not go away

రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తపిస్తున్న ఏ పార్టీ అయినా అధికార పక్షం మీద ప్రధానంగా దృష్టి పెడుతుంది.పవన్ కల్యాణ్ ఇందుకు భిన్నంగా వెళ్లారు.అయితే వైసిపి సునామీలో అటు టిడిపి ,ఇటు జనసేన కొట్టుకుపోయాయి.తదుపరి పరిణామాల్లో పవన్ కళ్యాణ్ బిజెపి వైపు మొగ్గు చూపి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన బిజెపి కూటమి మనుగడలో ఉంది. అయితే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ టిడిపి తో లోపాయికారిగా చెలిమి చేస్తూనే ఉన్నాడన్న అనుమానాలు ఉన్నాయి. బాబు యాక్షన్ ను బట్టి పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఉంటుందని కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అది అది నిజమే అనుకునేలా ఒక సంఘటన జరిగింది.రాజధాని ప్రాంత సమీపంలోని ఉద్దండరాయుని పాలెంకు చెందిన పులి చినలాజర్‌ మృతిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.

లాజర్ అమరావతి ప్రాంతంలో పేద‌, అసైన్డ్ రైతుల ప‌క్షాన నిలిచి పోరాడారు. అమరావతి నుంచి రాజధాని తరలింపు నేపథ్యంలోనే గుండె ఆగి మరణించాడు అంటూ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,ఆయన కుమారుడు లోకేష్ బాబు ట్వీట్ చేశారు. వెనువెంటనే పవన్ కళ్యాణ్ కు కూడా అదే మాదిరి స్పందించారు.ఇంకాస్త ముందుకెళ్లి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మానసిక వేధింపుల కారణంగానే చినలాజర్‌ మృతిచెందాడని పవన్‌ ట్వీట్ చేశారు. దీంతో ఇంకా చంద్రబాబు …పవన్ కళ్యాణ్ ఒకే పడవలో పయనిస్తున్నారు అన్న అనుమానం బలపడింది. అయితే ఈ వ్యవహారంలో లాజర్ కుమార్తె ఎస్తేర్ పవన్ కళ్యాణ్ ను కడిగిపారేయడ౦ కొసమెరుపు.రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే తన తండ్రి మరణాన్ని వక్రీకరిస్తున్నారని ఎస్తేర్‌ చెప్పడమే కాకుండా పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు లాజర్ గుర్తొచ్చాడా అంటూ నిలదీసింది.

‘మా ఊరు వచ్చినప్పుడు లాజరును ఆత్మీయ తండ్రి అంటూ నటించి వెళ్ళావే.. ఆ తర్వాత ఏమయ్యావు అని పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించింది. అనారోగ్యంతోనే తన తండ్రి మరణించాడని ,ప్రభుత్వ వేధింపులూ..అవీఇవీ అని చెత్త రాతలు రాయకండి అని ఆమె పవన్ కళ్యాణ్ ముఖాన కొట్టినట్టు చెప్పింది. నిలకడలేని నీతిమాలిన రాజకీయాల కారణంగానే పవన్ కళ్యాణ్ ఈ విధంగా భంగపాటుకు గురవుతున్నారని జన సైనికులే వాపోతున్నారు.

author avatar
Yandamuri

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk