Lock Down బిగ్ బ్రేకింగ్ : ఫేక్ జీవో సృష్టించిన వ్యక్తిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు..!!

Hyderabad police arrest man who created fake GO
Share

Lock Down : కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ ప్రభుత్వం చేపడుతున్నట్లు జీవో తో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు వార్తలు రావడం జరిగాయి. దీంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మంత్రులు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలియజేశారు. అదంతా ఎవరో సృష్టించింది అని తెలిపారు.

Hyderabad police arrest man who created fake GO Lock Down
Hyderabad police arrest man who created fake GO Lock Down

స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆ ఫేక్ జీవో ఎవరైతే సృష్టించారో ఆ వ్యక్తిని తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం చూస్తే  కార్వే కంపెనీలో సీఏ గా పనిచేస్తున్న శ్రీపతి సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఈ నకిలీ జీవో నీ సృష్టించినట్లు పోలీసులు గుర్తించడంతో వెంటనే అతన్ని ఈరోజు హైదరాబాదు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పెట్టే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. లాక్ డౌన్ అమలు చేయటం వల్ల సామాన్యులు ఎంతగానో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని కాబట్టి భవిష్యత్తులో కూడా లాక్ డౌన్ అనేది తెలంగాణలో పెట్టే అవకాశమే లేదని స్పష్టం చేశారు.


Share

Related posts

Vishakapatanam : విశాఖ విషయంలో ఏపీకి మరో టోపీ పెడుతున్న కేంద్రం..??

sekhar

ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త:ఏంటో చదవండి.. !!

somaraju sharma

తన ఫేవరెట్ ఇలాఖా లో చంద్రబాబు కి ‘ టార్చర్ ‘ మొదలైందా ?

sekhar