NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

నిస్సహాయత నుంచి అసహనం : జేసీ సోదరుల కథ!

 

 

అనంతపురం జిల్లాలో మూడు దశాబ్దాలపాటు చక్రం తిప్పిన కుటుంబం వారిది… యాక్షన్ దగ్గర నుంచి యాక్షన్ వరకు ఎన్నో చేశారు.. కాంగ్రెస్ పార్టీ అండదండలతో అనంతపురం జిల్లాలో ఒక రకంగా ఏలారు.. ప్రస్తుతం కాలం మొత్తం తిరగబడింది.. భయం వెంటాడుతోంది. ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా ముందుకు వెళ్లాలో? తెలియని అయోమయ పరిస్థితి. ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉంటే జగన్ అసలు ఉండనివ్వడు. పోనీ పార్టీ మారదంటే ఏ పార్టీ అంత అనుకూలంగా లేదు. సోనీ అధికార పార్టీ తోనే ఎలాగోలా సంప్రదింపులు జరిపి లాలూచీ పడడం అంటే కనీసం అటువైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన కరువాయే. కుటుంబం మొత్తం అందరిలోనూ అసహనం మాటల్లో అచేతనం.. అబ్బో జేఏసీ కుటుంబాన్ని ప్రస్తుతం చూస్తుంటే అనంతపురం జిల్లా రాజకీయాలను ఒకప్పుడు సాధించిన వీరేనా అన్న అనుమానం కలుగుతోంది. జగన్ దెబ్బకు వాళ్ళు కళ్ళు బైర్లు కమ్మి ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో కి వెళ్ళిపోయారు.

పాపం సోదరులాదే కాదు అబ్బాయిలది కూడా!!

జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ప్రధాన టార్గెట్ అనంతపురం జిల్లా జేసీ సోదరులు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ఏకంగా జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ.. బహిరంగ సవాల్ విసిరిన జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న ప్రతి మాట ప్రతి చర్య జగన్కి గుర్తే. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన జగన్ అనంతపురం లో మొదటి లక్ష్యం జెసి సోదరులనే చేశారు. మొదట వారు నిర్వహిస్తున్న సిమెంట్ ఫ్యాక్టరీ లు మైనింగ్ లీజులు మీద దెబ్బ కొడితే… తర్వాత వాళ్ళ బజ్జీలు వ్యాపారం మీద జగన్ దెబ్బ వేశారు. ఇక అడపాదడపా ఉన్న ఫైనాన్స్ వ్యాపారాన్ని ఆయన రకరకాల అడ్డంకులతో ప్రస్తుతం అడ్డుకున్నారు. ప్రస్తుతం జేసీ సోదరులకు ఆర్థికంగా అన్ని రకాల దారులు మూసుకుపోయాయి. ఎంతలా అంటే కనీసం నెలకు లక్ష రూపాయలు కూడా సంపాదించి లేని స్థితికి జెసి సోదరులు వచ్చారు. రూప కాపులు భారం సైతం వారిని వేధిస్తోంది. ఎంతో ఘనంగా రాజకీయాల్లోకి తెచ్చినా జెసి ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి దివాకర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డీ సైతం దీనమైన పరిస్థితి ఎదురుకుంటున్నారు. ఒకప్పుడు ఎంతో హుందాగా ఎంతో లగ్జరీగా బతికిన వీరు ఇప్పుడు ఆర్థిక దారులన్నీ మూసుకు పోవడం తో ఏం చేయాలో తెలీక రాజకీయం లో ఇమడలేక విలేకరుల సమావేశాల్లో మీడియా ముందు తమ అసహనాన్ని అచేతన వ్యవస్థను వెళ్ళగాకుతూ మాట్లాడటం కనిపిస్తుంది. గురువారం సైతం అనంతపురం టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జేసీ పవన్ రెడ్డి కావాలంటే రాజకీయాలు వదిలేస్తానని అరెస్ట్ లు చేయవద్దంటూ దీనంగా వేడుకోవడం విశేషం.

టీడీపీ నేత రాడు!

జేసీ కుటుంబాన్ని జగన్ కావాలని వేధిస్తున్నారు అన్న విషయం చంద్రబాబుకు తెలుసు. ఎందుకు వేధిస్తున్నారన్న విషయాలు చంద్రబాబుకు తెలుసు. తమ పార్టీలో ఉన్న నేతలను జగన్ అన్ని రకాలుగా దిగ్బంధనం చేసి అన్ని దారులను మూసివేసి మానసికంగా వేధిస్తున్న చంద్రబాబు ఏమీ అనలేని పరిస్థితి. కనీసం దీనిపై వ్యక్తిగతంగా ఆయన జగన్ను కలుసుకోలేని పరిస్థితి చంద్రబాబుది. అటు టిడిపి నేతలది అదే పరిస్థితి. జేసీ కోసం వెళితే జగన్ తమను ఎక్కడ భయపెడతాడు లేక మన మీద పడతాడో అన్న భయం ఉంది. ఎందుకంటే జగన్ కు జెసి సోదరులు వారు చేసిన చర్యలు ఎప్పటికీ గుర్తే. కాబట్టి జెసి సోదరుల నుంచి వకాల్తా పుచ్చుకుని జగన్ వద్దకు రాయబారం నడిపితే రాయబారం నడిపిన వారికే ప్రమాదం. దీన్ని గుర్తించుకునే టిడిపి నేతలు జెసి సోదరుల బాధను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
** ఇక టిడిపిని వీడి బీజేపీని చేరడం జెసి సోదరుల ముందున్న మార్గం. అయితే దీనికి బీజేపీ అధినాయకత్వం నుంచి కొన్ని అడ్డంకులు ఉన్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల అయిపోయిన తర్వాత జెసి సోదరులు బిజెపిలోకి వస్తారని అంతా భావించారు. అయితే వారు ఆ సమయంలో ఎందుకో కావాలని వెనకడుగు వేశారు. ఆ సమయంలో బిజెపి అధినాయకత్వం జెసి సోదరులు పార్టీలోకి తీసుకోవాలని భావించింది. అయితే ఇప్పుడు జెసి సోదరులు వైపు నుంచి బీజేపీ లోకి వెళ్లాలని ప్రతిపాదనలు వస్తున్నాయి బిజెపి నేతలు మాత్రం దానికి పచ్చజెండా ఊపడం లేదు. ఫలితంగా జేసీ సోదరులు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అన్న విషయాల్లో ఇప్పుడు కొంత సందిగ్ధత నెలకొంది.

author avatar
Comrade CHE

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N