టీడీపీలో చేరి తప్పు చేశాడట

అనంతపురం, డిసెంబర్ 30 : ఈ మధ్యనే వైఎస్‌ఆర్‌సిపి నుంచి తెలుగుదేశం పార్టీ లోకి ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మనసు మార్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడం పొరపాటైందని అంటున్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ,  చంద్రబాబునాయుడు పాలన బాగుందని తెలుగుదేశం పార్టీలో చేరి తప్పు చేశానని అన్నారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాతోపాటు ఐదుగురు కార్పొరేటర్లు కూడా టీడీపీకి రాజీనామా చేస్తున్నారని గురునాథరెడ్డి తెలిపారు. చంద్రబాబునాయుడు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని దుయ్యబట్టారు. త్వరలో తన రాజకీయ భవిష్యత్‌ ప్రకటిస్తానని గురునాథరెడ్డి తెలిపారు.