సౌదీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. కారణం తెలిస్తే మీకు కూడా కోపం వస్తుంది!

రియాద్ లో వచ్చే నెల 21, 22 తేదీలలో జరగనున్న జీ20 దేశాల ప్రత్యేక సమావేశాల సందర్భంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేకమైన నోటు పై ఉన్న ప్రపంచ పటం తప్పుగా ఉండడంతో భారత ప్రభుత్వం దీన్ని నిరసిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశం యొక్క బాహ్య ప్రాదేశిక సరిహద్దులను తప్పు గా చిత్రీకరించడం పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు భారత విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

వచ్చే నెల 21, 22 తేదీలలో జరగనున్న జీ-20 దేశాల ప్రత్యేక శిఖరాగ్ర సమావేశాలకు గుర్తుగా సౌదీ అరేబియా ఒక ప్రత్యేకమైన నోటును ఈ సమావేశాలకు తీసుకువచ్చింది. ఈ నోటును సౌదీ అరేబియా ద్రవ్య అథారిటీ ఈనెల 24వ తేదీన విడుదల చేసింది. 20 రియల్ విలువ చేసే ఈ నోట్ పై ఒక వైపు సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఫోటో ఉండగా, మరొక వైపు ప్రపంచ పటం ముద్రణ ఉంది. ప్రపంచ పటంలో జీ 20 దేశాల ను వివిధ రంగులలో ప్రచురించారు.

సౌదీ అరేబియా రూపొందించిన ప్రత్యేక నోటుపై ప్రపంచ పటంలోని భారతదేశ ప్రాదేశిక సరిహద్దులలో భాగంగా కాశ్మీర్ ను కాకుండా,గిల్గిట్, బాల్టిస్తాన్లను పాకిస్తాన్లో భాగంగా వర్ణించలేదు. సౌదీ అరేబియా అధికారిక చట్టపరమైన నోటుపై భారతదేశ ప్రాదేశిక సరిహద్దులను పూర్తి తప్పుగా చిత్రీకరించడంతో, అందుకుగాను న్యూఢిల్లీలోని ఆ దేశ రాయబారి ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేకమైన నోటును అత్యవసరంగా తీసుకున్న నిర్ణయం కావున భారత ప్రభుత్వం సౌదీ వైపు నుంచి దిద్దుబాటును కోరారని భారతదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అంతేకాకుండా భారతదేశంలో జమ్ము కాశ్మీర్, లడక్ ప్రాంతాలు అంతర్భాగంగా ప్రకటించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.