NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

IPS AB Venkateswara Rao: ఏపి రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు సంచలన కామెంట్స్

IPS AB Venkateswara Rao: ఏపి ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన సంచలన కామెంట్స్ ఇటు అధికార, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. రెండేళ్ల పైబడి సస్పెన్సన్ లో ఉండి సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి విధుల్లోకి చేరిన విషయం తెలిసిందే. ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ప్రభుత్వం ఎత్తివేయడంతో గురవారం ఆయన జీఏడీలో రిపోర్టు చేశారు. టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై వైసీపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తన సస్పెన్షన్ పై తొలుత హైకోర్టు, ఆ తరువాత సుప్రీం కోర్టును ఆశ్రయించగా కోర్టుల నుండి ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో ఎట్టకేలకు ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేసింది. జీఏడీలో రిపోర్టు చేసిన ఆయన ఆ తర్వాత విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

IPS AB Venkateswara Rao controversial comments on sajjala
IPS AB Venkateswara Rao controversial comments on sajjala

IPS AB Venkateswara Rao: మూడేళ్లుగా ఏం పీకుతున్నారు

విజయవాడ సీపీగా ఉన్న సమయంలో, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీకి అనుకూలంగా పని చేశారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, మూడేళ్లుగా ప్రభుత్వంలో ఉండి ఏం పీకుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తానేదో తప్పు చేశానని చెబుతున్న వారు ఆ తప్పు ఏమిటి అన్న విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. మూడేళ్లు అయ్యింది తాను ఫలానా తప్పు చేశాను అని తేల్చారా అని ప్రశ్నించారు. తాను తప్పు చేసి ఉంటే తేల్చాలన్నారు. విజయవాడ సీపీగా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా తాను ఎలా బాధ్యతలు నిర్వహించానో తనకు తెలుసు, అందరికీ తెలుసునన్నారు. తాను తప్పు చేసి ఉంటే ఎవరైనా చెప్పాలిగా అని ప్రశ్నించారు. తాను తప్పు చేసి ఉంటే బాధితుల నుండి వ్యాగ్మూలం తీసుకుని కేసు రిజిస్టర్ చేయండి అన్నారు. తనపై చేసే ఆరోపణలను రుజువు చేయకుండా మీడియాలో పేరు చెప్పి బురద చల్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

IPS AB Venkateswara Rao: తప్పుడు కేసులు పెడితే నిలువరించా

తాను విజయవాడ సీపీగా ఉన్న సమయంలో డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ అనే కార్యక్రమం చేపట్టి ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ ఇచ్చామన్నారు. దేశంలో మొట్టమొదటి సారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, విజయవంతంగా మూడేళ్ల పాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. తాను బదిలీ అయిన తరువాత దాన్ని ఆపేశారన్నారు. అలానే కోర్టు మానిటరింగ్ సిస్టమ్ పెట్టామనీ, అది దేశం మొత్తానికి ఆదర్శం అయ్యిందన్నారు. తాను తప్పులు చేసి ఉంటే ఈ తప్పులు చేశావు అంటూ చార్జి షీటు ఇవ్వాలని కోరారు. తాను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో పోలీసులు తప్పుడు పనులు చేస్తే వాటిని కరెక్టు చేసిన మొదటి వ్యక్తిని తానని చెప్పారు. రాజకీయ నేతలపై తప్పుడు కేసులు పెట్టేందుకు యత్నించిన పోలీసులను ఇట్లాంటి వెధవ పనులు చేయవద్దని వారించానని చెబుతూ పలు ఉదాహారణలు వివరించారు. ఇందులో భాగంగా 75 ఏళ్ల వయసులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఆయనను ఇబ్బంది పెట్టాలని చూస్తే నిలుపుదల చేశానన్నారు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయన్నారు.

అసంపూర్తిగా ఉత్తర్వులు

ఇదే క్రమంలో సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అసంపూర్ణంగా ఉన్నాయని చెప్పారు ఏబీ వెంకటేశ్వరరావు, ఈ విషయాన్ని తెలియజేసేందుకు తాను సీఎస్ ను కలిసేందుకు ప్రయత్నించగా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తనకు న్యాయం జరగకపోతే మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. తనతో పాటు కలిసి పని చేసిన అనేక మంది కింది స్థాయి పోలీసులకు ఏళ్ల తరబడి వీఆర్ లో పెట్టారనీ, వారికి కనీసం వేతనాలు కూడా ఇవ్వడం లేదని అన్నారు ఏబి వెంకటేశ్వరరావు, వారి బాధతలను సీఎస్ కు చెబుదామంటే అవకాశం ఇవ్వలేదన్నారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ వర్గాల్లో, అటు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయంశం అవుతున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు చేసిన కీలక వ్యాఖ్యలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju