IPS Kunduswamy: అమిత్ షా గుట్టు/ జుట్టు స్టాలిన్ చేతిలో..! ఆ IPS నియామకం వెనుక ఘాటు వ్యూహం..!?

IPS Kunduswamy: Amith shah Cases ex CBI Officer now DGP
Share

IPS Kunduswamy: తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. తమిళనాడు డీజీపీ నియామకం స్టాలిన్ రాజకీయ వ్యూహంపై కొన్ని అపోహలను కలిగిస్తుంది. కొంత ప్రచార ఆస్కారానికి ఇస్తుంది.. పోలీసు శాఖలో కొందరు సీనియర్ అధికారులను కాదని.. తమిళనాడు డీజీపీగా పీ. కుందుస్వామిని స్టాలిన్ నియమించారు. ఈ కుందుస్వామికి గత చరిత్ర చూస్తే బీజేపీకి వణుకు పుట్టడం ఖాయం. తమిళనాడుతో పాటూ జాతీయస్థాయిలో ఓ రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ నియామకం జరిగి ఉంటుందని కొన్ని చర్చలు ఊపందుకున్నాయి..

IPS Kunduswamy: Amith shah Cases ex CBI Officer now DGP
IPS Kunduswamy: Amith shah Cases ex CBI Officer now DGP (2010 Amith Shah Arrest Photo)

IPS Kunduswamy: ఎవరీ కుందుస్వామి..!?

ఐపీఎస్ అధికారిగా ఓ చారిత్రిక నేపథ్యం కలిగిన అధికారి ఈయన. సంచలన కేసులను డీల్ చేశారు. పెద్ద పెద్దోళ్ళను విచారించారు. 2010 లో అమిత్ షా గుజరాత్ హోమ్ మంత్రిగా ఉన్న సమయానికి కుందుస్వామి సీబీఐలో పనిచేశారు. ఆ సమయంలో సోహ్రాబుద్దీన్ నకిలీ ఎంకౌంటర్ కేసులో అమిత్ షాని కుందుస్వామి అరెస్ట్ చేశారు. దేశం మొత్తం గుజరాత్ గురించి చెప్పుకున్న రోజులవి. నరేంద్ర మోడీ సీఎం గా.., అమిత్ షా హోమ్ మంత్రిగా అక్కడ చక్రం తిప్పుతున్న సమయంలో ఈ అరెస్టు దేశం మొత్తం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కుందుస్వామి అమిత్ షాని అరెస్టు చేశారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈయనకు అప్రాధాన్య పోస్టులోకి నెట్టేసింది. ఆ తర్వాత అమిత షాపై కేసులను కూడా కోర్టు కొట్టేసింది. కానీ దీని కంటే ముందే 2007 లో కుందుస్వామి కొన్ని సంచలన కేసులను దర్యాప్తు చేశారు. బ్రిటన్ యువతీ అత్యాచారం, హత్యా… కేరళ సీఎం పినరయి విజయం పై వచ్చిన ఆర్ధిక కుంభకోణం కేసులు.. ఇవన్నీ విచారించారు. అమిథ్ షా కి సంబందించిన గుట్టు మొత్తం తెలిసిన పోలీసు అధికారుల్లో కుందుస్వామి ఒకరు.

IPS Kunduswamy: Amith shah Cases ex CBI Officer now DGP
IPS Kunduswamy: Amith shah Cases ex CBI Officer now DGP

స్టాలిన్ హెచ్చరికలు.. బీజేపీ సైలెంట్..!?

తాజాగా ఎన్నికలకు ముందే ప్రచార సమయంలో స్టాలిన్ కొన్ని హెచ్చరికలు చేశారు. అన్నా డీఎంకే ప్రభుత్వం భారీగా కుంభకోణాలకు పాల్పడింది అనీ.. కొన్ని అక్రమ కేసులను పెడుతుంది అనీ.. వాటిని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని బయటపెడతామని హెచ్చరించారు. ఏ నాయకుడు సీఎం అయినా తన డీజీపీ అత్యంత సమర్ధుడు ఉండాలని కోరుకుంటారు. అందుకే కుందుస్వామిని నియమించి స్టాలిన్… అటు డీఎంకే కి, బీజేపీకి పరోక్ష వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే కేంద్రంలో బీజేపీ ఉంది. అమిత్ షా కేంద్ర హోమ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఐపీఎస్ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తుంటారు. కుందుస్వామిని కుదిపేయడం ఆయన పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతానికి అయితే వ్యవహారం సైలెంట్ గానే ఉంటుంది. బీజేపీ ఒకవేళ స్టాలిన్ పై బాణాలు వదిలితే… AIDMKతో కలిసి రాజకీయాలు నడిపితే స్టాలిన్ ఈ బాణాలను వదలడానికి ముందుగానే సిద్ధం చేస్తున్నారని తమిళవర్గాలు పేర్కొంటున్నాయి..!


Share

Related posts

Tollywood : ఎవరిని కదిలించినా ‘పాన్ ఇండియా’ జపమే..! రియాల్టీ లోకి రారా? 

siddhu

పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ

somaraju sharma

YS Jagan : రైతులకు ప్రత్యేక చట్టాలుంటాయా? ఇదేం కొత్త కార్యాచరణ??

Comrade CHE