Nara Lokesh: నారా లోకేష్ టీడీపీకి భారమయ్యారా..!? ఆ యువనేత వలనే పార్టీ అవమానాలు ఏడుసుకోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు అంతర్మధనం చెందుతున్నారా..!? నారా లోకేష్ ఏ మాత్రం మారడం లేదా..!? చిన్న వయసులోనే కోటరీలో చిక్కుకుని బయటకు నటిస్తున్నారా..!? ఇవన్నీ టీడీపీలో చీకటి చర్చలే.. బయటకు మాట్లాడలేక, లోలోపల మధనపడుతున్న ఆవేదన కథలే..!రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉంది.. ఈ పార్టీకి గత ఎన్నికల్లో కేవలం 23స్థానాలే వచ్చాయి. ఈ పార్టీ కి ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లో ఉన్న మైనస్ లు ఏమిటి..? అయన తక్షణం మార్చుకోవాల్సిన విషయాలు ఏమిటి..? అనేది పరిశీలిస్తే.. రాజకీయ భవిష్యత్ ఆలోచిస్తున్న నాయకులు నారా లోకేష్..!
నారా లోకేష్ గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి.!
* నారా లోకేష్ ఇంటర్ చదివే సమయంలో ఆరు సెల్ ఫోన్ లు వాడేవారట.. ఆయన ఇంటర్ తరగతులకు కాలేజీ కి వెళ్ళలేదు. కేవలం పరీక్షలు రాసేందుకు మాత్రమే కాలేజీకి వెళ్లారట. మొత్తం ఇంట్లోనే కథని, చదువులను నడిపించారట..! నిజానికి లోకేష్ పుట్టిన్నప్పుడే తాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి.. ఊహ తెలిసిన నాటికీ తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి.. అందుకే లోకేష్ అల్లారు ముద్దుగా పెరిగాడు. ఇంటర్ చదువులు ఇంట్లోనే పూర్తి చేసారట. నారాయణ కళాశాల నుండి అధ్యాపకులే ఇంటికి వెళ్లి క్లాస్ లు చెప్పారని సమాచారం. అందుకే నారాయణ కాలేజీ అధినేత నారాయణకు.. టీడీపీకి అప్పటి నుండే బంధం ఏర్పడింది.
ఇక లోకేష్ మైనస్ ల విషయానికి వస్తే.. * నారా లోకేష్ కు తన చుట్టూ ఉన్నవాళ్లు లోపాలు చెబితే అంగీకరించరు. పొగడ్తలు, భజన చేసే వాళ్ళు కావాలి. వాళ్ళ మాటలే వింటుంటారు. * కేవలం ముఖస్తుతి చేసే వాళ్లనే ఆయన టీమ్ లో పెట్టుకున్నారు. వాస్తవాలను అయనకు చెప్పే వాళ్ళు లేరు. చెప్పినా వినరు.. అంగీకరించరు..!
* ఎమ్మెల్యేలతో సరైన కాంటాక్ట్ లేదు. ప్రతి పక్షం లో ఉన్నప్పుడు పార్టీ బలోపేతం కావాలి అంటే ఎమ్మెల్యేలతో కాంటాక్ట్ లో ఉండాలి. గెలిచిన ఎమ్మెల్యే లే 23 మంది. అందులో నలుగురు చేజారి పోయారు. వాళ్ళ అవసరానికి పార్టీని వీడారు.. మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలతో అయినా అయన సన్నిహిత బంధాన్ని కొనసాగించాలి. ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలల్లో ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్లతో మాట్లాడాలి. విషయాన్ని తెలుసుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. యువ నాయకుడుగా ఉన్న ఆయన ఎమ్మెల్యేలు ఎస్ఎంఎస్ చేసినా, కాల్ చేసినా వాళ్ళ తో సన్నిహితంగా మెలగాలి. కానీ లోకేష్ ఆ విధంగా స్పందించడం లేదన్న అభిప్రాయం ఉంది.
* ఎమ్మెల్యే లతోనే కాకుండా పార్టీ నేతలతో కూడా ఓపెన్ గా మాట్లాడరు అన్న అపవాదు ఉంది. పార్టీ నేతలతో ఓపెన్ గా ఉండక పోవడం పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు.. నేతలు లోపాలు చెప్పినా, సలహాలు చెప్పినా ఒప్పుకోరు. రియాలిటీని గ్రహించరు, ఒప్పుకోరు. అయితే గతంతో పోలిస్తే లోకేష్ లో ఆయిదు పది శాతం మాత్రమే మార్పు వచ్చింది అని అంటున్నారు. లోకేష్ గురించి ఇటువంటి అంతర్గత చరిత్ర చాలానే ఉంది. ఒక్కోటీ సమయానుగుణంగా చెప్పుకుందాం..!
Acharya: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. రామ్ చరణ్(Ram Charan) ఫస్ట్ టైం లాంగ్ లెన్త్ రోల్…
Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…