NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దగ్గుబాటి కుటుంబంపై ఆ ప్రచారం నిజమేనా?

మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబం వైసిపిలో చేరనున్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయమై మీడియాలో,సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దగ్గుబాటి కుటుంబం అంతా వైసిపిలో చేరుతుందని కొన్ని మీడియాల్లో వార్తలు రాగా మరికొన్ని మీడియా సంస్థలు మాత్రం కేవలం దగ్గుబాటి పురంధేశ్వరి దంపతుల కుమారుడు దగ్గుబాటి హితేష్ మాత్రమే వైఎస్ఆర్సిపిలో చేరతాడని, పురంధేశ్వరి మాత్రం బిజెపిలోనే కొనసాగుతారంటూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అయితే మొత్తంమీద దగ్గుబాటి కుటుంబం నుంచి వైసిపి లోకి ఎంట్రీ అనేది మాత్రం ఖాయమనే భావించే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది.

అయితే ఈ విషయమై దగ్గుబాటి కుటుంబం నుంచి ఎవరూ అధికారికంగా ఏ ప్రకటన, వివరణ ఇవ్వకపోయినప్పటికి తాజాగా చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు మాత్రం దగ్గుబాటి కుటుంబం వైసిపిలో చేరనుందనే ప్రచారం నిజమేనని బలపరిచే విధంగా ఉన్నాయి. దగ్గుబాటి హితేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో గొల్లపాలెం గ్రామంలో వైసిపి పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి శుభాకాంక్షల ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. ఈ ఫ్లెక్సీలో స్థానిక వైసీపీ నేతలతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఫోటో ఓ వైపు వుండగా మరోవైపు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉంది. అంతేకాదు ఇదే ఫ్లెక్సీలో దగ్గుబాటి హితేష్ ఫోటో కూడా ఉండటం గమనార్హం.

అయితే వైసిపిలో చేరనున్నట్లు మీడియాలో వార్తలు రావడంపై దగ్గుబాటి వెంకటేశ్వరరావుని కొందరు మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా సమయం వచ్చినప్పుడు ఆ విషయమై స్పష్టత ఇస్తామని చెప్పడం ఆ ప్రచారాన్ని బలపరిచే విధంగా ఉండగా…తాజాగా వైసిపి ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల వ్యవహారం దీన్ని మరింత పరిపుష్ఠం చేసే విధంగా ఉంది. కారణమేమంటే ఏకంగా వైసిపి ఫ్లెక్సీపై తన ఫోటో, తన కుమారుడి ఫోటోని ముద్రించినా దాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏ మాత్రం ఖండించకపోగా మౌనం వహించడంతో ఇక ఈ కుటుంబం వైసిపిలో చేరడం లాంఛనమేననే ప్రచారం మరింత జోరందుకుంది.

ఇదిలావుంటే దగ్గుబాటి కుటుంబాన్ని వైసిపిలోకి చేర్చే విషయాన్ని వైసిపి రాజ్యసభ ఎంపి విజయాసాయిరెడ్డి తన భుజంపై వేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయనే ఈ విషయమై ఇటు జగన్ తోనూ అటు దగ్గుబాటి కుటుంబంతోనూ చర్చలు జరుపుతున్నారని వినికిడి. మరోవైపు దగ్గుబాటి పురందేశ్వరి తమ పార్టీలోకి వస్తామంటే స్వాగతం పలుకుతామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్తుండటం గమనార్హం. అయితే ఈ సస్పెన్స్ వీడేందుకు ఎక్కువ సమయమేమీ పట్టదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

author avatar
Siva Prasad

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Leave a Comment