NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కరోనా ట్రీట్మెంట్ పదివేలానా? కార్పొరేట్ లక్షలు ఎందుకు వసూలు చేస్తున్నాయ్? 

మహమ్మారి కరోనా వైరస్ తెలంగాణలో విలయతాండవం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మొదటిలో కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో, అదే రీతిలో కరోనా చికిత్స అందించే విషయంలో చోద్యం చూసిన ప్రభుత్వంపై న్యాయస్థానాలు, విపక్షాలు నుండి విమర్శలు రావటంతో పాటు ప్రజలు కూడా సీరియస్ అవ్వుతూ సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టడం మనకందరికీ తెలిసిందే. దెబ్బకి మొద్దు నిద్ర లేచిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే కరోనా ట్రీట్ మెంట్ విషయంలో ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇవ్వడం జరిగింది.

Is the corona treatment tens of thousands? Why are corporate lakhs being collected?
Is the corona treatment tens of thousands? Why are corporate lakhs being collected?

కాగా టైం కలిసి రావడంతో కరోనా బాధితుల దగ్గర లక్షల్లో కార్పొరేట్ ఆసుపత్రులు ఫీజులు వసూలు చేయడంతో చాలా మంది ఆస్తులు, ఇల్లు అమ్ముకునే ఘటనలు చోటుచేసుకున్నాయి. కరోనా భయాన్ని క్యాష్ చేసుకోవడానికి తెలంగాణ కార్పొరేట్ ఆస్పత్రులు సామాన్యుల మీద ఫీజుల భారం అధికం చేస్తూ రోజుకు లక్షల రూపాయలు మొన్నటి వరకు వసూలు చేస్తూ వచ్చాయి. దీంతో చాలామంది కరోనా బారిన పడిన సామాన్యులు ఫీజులు కట్టుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోపక్క ఆసుపత్రి వర్గాలు ఫీజులు కడితేనే పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తామని వ్యవహరించడంతోకరోనా రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా చికిత్సకి మహా అయితే పది వేలు రూపాయలు అవుతాయామో, అంతకుమించి ఖర్చు కాదు. అసలు రోజుకి రెండు లక్షల రూపాయలు కరోనా ట్రీట్మెంట్ కి అవ్వదు, ఆ విధంగా హాస్పిటల్స్ ఫీజులు వసూలు చేస్తే వాటిపై చర్యలు తీసుకుంటామంటూ చెప్పటంతో ప్రజలకు ఆగ్రహాన్ని కలిగించినట్లయింది.

ఇటీవల గచ్చిబౌలిలో టీమ్స్ ఆసుపత్రిని పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా అందుబాటులోకి తీసుకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. కరోనా లక్షణాలు కనిపించగానే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని పాజిటివ్ వస్తే నాలుగైదు రోజులు ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్ లో చేరాలని ప్రజలను కోరారు.

కొంతమంది కి పాజిటివ్ వచ్చిన నాలుగైదు రోజులు బయట తిరగడం వల్ల వైరస్ తీవ్రత అధికమవు తోందని, అలాంటి వారిని రక్షించడం కష్టం అవుతుందని పేర్కొన్నారు. అయితే మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

మొన్నటి వరకు ప్రజల దగ్గర కార్పొరేట్ ఆస్పత్రులు రోజుకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంటే చోద్యం చూసిన ప్రభుత్వం ఇప్పుడు 10,000 చెప్పడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు కరోనా వైరస్ చికిత్స కి ప్రైవేట్ ఆస్పత్రిలకి అనుమతులు ఇచ్చినప్పుడే ఈ ఫిజ్ ప్రకటించి ఉంటే చాలామంది మోసపోయే వారు కాదు కాదా?… ఇప్పుడు లక్షల్లో ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని సీరియస్ అవుతున్నారు. 

 

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju