బాలయ్యకు పదవి వెనక ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? బాబు మామూలోడు కాదే!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అకస్మాత్తుగా బావమరిది కం వియ్యంకుడు నందమూరి బాలయ్య ముద్దు వచ్చాడు.వెంటనే ఆయనను చంకఎక్కించుకున్నారు.

is there such a flashback to balayyas tenure chandra babu strategy
is there such a flashback to balayyas tenure chandra babu strategy

తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు ముద్దుల పుత్రుడైన నందమూరి బాలయ్యను ఆ రోజుల్లోనే ఒక ఎన్నికల ప్రచార సభలో తన రాజకీయ వారసుడిగా తారక రాముడు ప్రకటించగా పెద్ద రచ్చ జరిగింది. ఆ ప్రకటనను ఎన్టీఆర్ ఉపసంహరించుకునేంత వరకు చంద్రబాబు నిద్ర పోలేదు. తదుపరి పరిణామాల్లో ఎన్టీఆర్ నుండి టిడిపిని చంద్రబాబు హైజాక్ చేశారు. ఆవేశపరుడు గా పేరొందిన నందమూరి హరికృష్ణ నుండి ఏ సమస్య రాకుండా ఆయనను ఆరు నెలల పాటు మంత్రిని చేసి వదిలారు. ఆపై అనివార్య పరిస్థితుల్లో ఆయనను ఎంపీని చేశారు. తరువాత టిడిపి పొలిట్బ్యూరో సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో నందమూరి బాలకృష్ణ తో చంద్రబాబు వియ్యం పొందారు.

is there such a flashback to balayyas tenure chandra babu strategy
is there such a flashback to balayyas tenure chandra babu strategy

బాలయ్య కుమార్తె బ్రాహ్మణిని చంద్రబాబు తనయుడు లోకేష్ వివాహమాడారు. 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుండి ఎమ్మెల్యేగా బాలయ్య గెలుపొందారు. ఎమ్మెల్యే గా ఉండడం తప్పితే ఆయన ఏమీ టిడిపి రాజకీయాల్లో చురుగ్గా లేరు. కెసిఆర్ తో గాని జగన్ తోగాని బాలయ్య గొడవ పడ్డ సందర్భాలు కూడా లేవు. ఇంకా చెప్పాలంటే పూర్వాశ్రమంలో ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాక్సాఫీస్ బొనంజా నందమూరి బాలయ్య వీరాభిమాని. క్లుప్తంగా చెప్పాలంటే బాలయ్య బావ తోటి బావమరిది గా తెలుగు దేశంలో ఉంటూ ఎమ్మెల్యే పదవి తో హ్యాపీగా ఉన్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా బాలయ్య ను టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడిగా చంద్రబాబు నాయుడు నియమించటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బాలయ్య అడక్కపోయినా చంద్రబాబు ఈ పదవిని ఆయనకు ప్రసాదించారు.

అయితే దీనికి బలమైన కారణం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నందమూరి బాలకృష్ణ సోదరి ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి రావడాన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు వ్యూహాత్మకంగానే నందమూరి బాలయ్యకు పార్టీ పోలిట్ బ్యూరో లో స్థానం కల్పించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీనే ఎన్టీఆర్ కుమార్తెను గౌరవిస్తే టిడిపిని స్థాపించిన ఎన్టీఆర్ కుమారుడు కే ఆ పార్టీలో కీలక పదవి లేకుంటే ఎలా ? ఇది ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తుందని ఆలోచించిన చంద్రబాబు నాయుడు అవకాశము ,సందర్భం రావడంతో బాలయ్యకు పార్టీలో పెద్దపీట వేశారని టిడిపి వర్గాలు చెప్పుకుంటున్నాయి.సోదరి పురంధరేశ్వరి తో బాలయ్యకు సత్సంబంధాలున్నాయి. దాన్ని కూడా అవసరమైన సమయంలో క్యాష్ చేసుకొనే ఆలోచన కూడా చంద్రబాబు కి ఉందంటున్నారు. చంద్రబాబు మైండ్ సెట్ ను బట్టి చూస్తే బాలయ్యకు పదవి ఇవ్వడం వెనక పెద్ద ప్లాను ఉందని చెప్పకనే తెలుస్తోంది