ABN Radhakrishna : జ్యోతి మూసేసి ఇక తెలుగుదేశంలో చేరిపోవడమే ఉత్తమం!

ABN Radhakrishna : జ్యోతి మూసేసి ఇక తెలుగుదేశంలో చేరిపోవడమే ఉత్తమం!
Share

ABN Radhakrishna : ప్రతీ వారం తన గురువు చంద్రబాబుకు ఏదో సాయం చేద్దామని అనుకుంటూ చిలక పలుకులు పలికే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ABN Radhakrishna పూర్తిగా తాను జర్నలిస్టులు అయిన విషయం మరిచిపోయారు. ఏదో చెబుదామనుకుని ఇంకేదో చెబుతూ అదే పెద్ద నికార్సైన జర్నలిజం అని భావించే రాధాకృష్ణ ఈ వారం మున్సిపల్ ఎన్నికలలో టీడీపీకి సానుభూతి తెచ్చేలా, అధికార పార్టీ ఏదో చేసేస్తుంది అని భూతద్దంలో చూపేలా తన కొత్త పలుకులు మొదలు పెట్టారు.

ABN Radhakrishna it is better to join tdp radhakrishna
ABN Radhakrishna it is better to join tdp radhakrishna

ఎందుకీ నిందలు!

చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని పెద్ద నేరం అన్నట్లు ప్రతీవారం ప్రజలమీద తప్పులు వేసే రాధాకృష్ణ ఈ వారం కూడా అదే పద్ధతిని అనుసరించారు. పంచాయితీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిని, మున్సిపల్ ఎన్నికల్లో కనీసం టిడిపి తరఫున పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకని విషయాన్ని దాచి పెట్టి, గోరంతలు కొండంతలు చేసి అధికార పార్టీ అభ్యర్థులను బెదిరించింది అనే నెపాన్ని నెట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల్లో ఎంతో శ్రద్ధ వహించి, ప్రతిపక్ష పార్టీకి అనుకులించే నిర్ణయాలు తీసుకున్న టీడీపీ కు అభ్యర్థులు దొరకని విషయం రాధాకృష్ణకు తెలుసో తెలియదో అర్థం కాదు. పార్టీ మ్యాండెట్ లను సైతం అమ్ముకొని టీడీపీ కు రాంరాం చెప్పిన టీడీపీ నాయకులు గురించి మాత్రం ఆయన తన పత్రికలో రాయరు. చింతమనేని వంటి కరుడుగట్టిన టీడీపీ నాయకులే తమ పార్టీ అభ్యర్థులు మూకుమ్మడిగా అధికార పార్టీ లోకి వెళ్లి పోవడాన్ని సహించలేక జనసేన కు ప్రచారం చేస్తానని బహిరంగంగా చెప్పడంతో ఏబీఎన్ ఛానల్ కు కనిపించదు.

**మహా విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల మీద రాధాకృష్ణ చేసిన ప్రయోగం టీడీపీ కు మైలేజ్ తెచ్చేలా కనిపించడం లేదు. విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, అక్కడ ఎట్టి పరిస్థితిలో గెలిచి తీరాలని మంత్రులకు సూచించారని చెప్పుకొచ్చారు. అంతేకాదు విశాఖ నగర పాలక సంస్థ గెలవకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి కూడా వెనుకాడబోనని ముఖ్యమంత్రి ఏబీఎన్ రాధాకృష్ణ తో స్వయంగా చెప్పారట! విశాఖ నగరపాలక సంస్థ లో ఇప్పటికే వైసీపీ బలంగా ఉంది. చంద్రబాబు రోడ్ షో కు సైతం జనం కనిపించకపోవడంతో ఏం రాయాలో అర్థంకాని రాధాకృష్ణ దీనిని జగన్ కు ముడి పెట్టడానికి ప్రయత్నించారు. ఒక నగరపాలక సంస్థ లో ఓడిపోతే ముఖ్య ముఖ్య మంత్రి అయినా రద్దు చేస్తారా… దీనిని ప్రజలు నమ్మడం అంటుంచి నవ్వుకో రా అన్న స్పృహ సైతం రాధాకృష్ణ మరిచిపోయారు.

** ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకొని మరీ టిడిపి మంత్రులు రాజీనామా చేశారని కొత్త పలుకు లో రాసుకొచ్చారు. దీని వెనుక చంద్రబాబు రాజకీయ కోణం లేదు కేవలం పోరాటం కోసమే వారు రాజీనామా చేశారు అంటూ రాధాకృష్ణ చెప్పే ప్రయత్నం చేశారు. ఇది అక్షరాల తప్పు. 2014 ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వంలో ఉన్న బిజెపి ను బూచిగా చూపి, ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్ ను వాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు. దీంతోనే బీజేపీతో స్నేహానికి రామ్ రామ్ చెప్పి బయటికి వచ్చారు. మోడీ, అమిత్ షా ను తిట్టిన తిట్టు తిట్టకుండా ఎన్నికల ప్రచార సభలో నిందించారు. ముఖ్యమంత్రిగా తన పాలనా వైఫల్యాన్ని కేంద్రం మీద తోసేయాలని, వారినే విలన్లుగా చూపించాలని నది చంద్రబాబు వ్యూహం. దీనికి జగన్కు అసలు సంబంధం ఏముంది..? టిడిపి మంత్రులు రాజీనామా చేసి చేసిన పోరాటం ఏమిటి? సాధించిన ప్రత్యేక హోదా ఎక్కడ..?

వైయస్ రాజశేఖర్ రెడ్డి ని తెచ్చారు!

చంద్రబాబు ను అభివృద్ధి మోడల్ అని కీర్తించిన వరకు బాగానే ఉన్నా ముఖ్యమంత్రి జగన్ ను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంతులే తో పోల్చడం రాధాకృష్ణ దిగజారుడుతనం గానే చెప్పుకోవాలి. అవినీతి కేసులతో పదవిని పోగొట్టుకున్న అంతులే కు జగన్ కు ముడి పెట్టి వచ్చిన ఈ కథనం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాలి. మరోపక్క సంక్షేమం పేరుతో ప్రజల డబ్బు ప్రజలకే చెందాలని, ఎన్నికల మేనిఫెస్టో లోని అన్ని అంశాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మాత్రం రాధాకృష్ణకు కనిపించవు.

ఎందరికో విద్యాదానం, ఆరోగ్య దానం చేసి ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి సంక్షేమ పథకాలను సైతం రాధాకృష్ణ ఎందుకు పనికిరావు అన్నట్లు రాసుకు రావడం ఆయన విజ్ఞతకే వదిలేయాలి. అభివృద్ధి మోడల్ అని రాధాకృష్ణ చెప్పుకునే చంద్రబాబు 2014 నుంచి చేసిన బొమ్మల గారడి కు ప్రజలు విసిగెత్తి, తమ కోసం ఉండే నాయకుడిగా జగన్మోహన్రెడ్డిని గెలిపించుకున్నారు. అయితే ప్రతిసారీ ప్రజా తీర్పును అవహేళన చేసే రాధాకృష్ణ ఈవారం కూడా దానిని కొనగించారు అని చెప్పాలి.

 


Share

Related posts

సర్కారు వారి పాట విషయంలో అందరికీ మబ్బులు విడిపోయాయి..!

GRK

కూతుర్ని తలుచుకొని నాగబాబు ఎమోష‌న‌ల్ .. వైరల్‌గా మారిన పోస్ట్!

Teja

5000 కోట్ల రూపాయ‌లు…. ఒక్క చోటే జ‌గ‌న్ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసా?

sridhar