NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

Vangaveeti Radha: పరీక్ష కొడాలి నానిది.. ఫెయిల్ అయింది జగన్..! రాధ రాజకీయంలో ట్విస్టు!!

jagan and kodali nani fails at vangaveeti radha

Vangaveeti Radha: ప్రస్తుత ఏపీలోనే కాదు.. ఉమ్మడి ఏపీలో సైతం విజయవాడ కేంద్రంగానే రాజకీయాలు నడిచేవి. ఎన్నికల్లో కాపు సామాజికవర్గ ఓట్లు చుట్టూ రాజకీయం నడుస్తుంది. ముఖ్యంగా కాపు ఓటర్లకు ‘వంగవీటి’ (Vangaveeti Radha) అనే పేరు ఓ ఎమోషన్. మూడు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో వంగవీటి రంగా సృష్టించిన బ్రాండ్ అది. రంగా వారసుడిగా తనయుడు వంగవీటి రాధా రాజకీయాల్లో అంతగా ప్రభావం చూపకపోయినా సామాజిక బలం ఉంది. ఇప్పుడదే రాధా చుట్టూ జరుగుతున్న రాజకీయం కాపు ఓట్లు రాజకీయంగా ఎంత ప్రభావితం చూపుతాయో నిదర్శనంగా నిలుస్తోంది.

jagan and kodali nani fails at vangaveeti radha
jagan and kodali nani fails at vangaveeti radha

Vangaveeti Radha: వైసీపీకి షాకిచ్చిన రాధా.. 

తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందని డిసెంబర్ 26న వంగవీటి రంగా వర్ధంతి రోజున రాధా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను ప్రకంపనలు రేపాయి. 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన రాధాను తమ పార్టీలోకి మళ్లీ రప్పించి కాపులను ఆకర్షించి.. రాజకీయంగా పవన్ కల్యాణ్-చంద్రబాబును దెబ్బకొట్టాలని వైసీపీ స్కెచ్ వేసింది. ఈక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ రంగంలోకి దిగారు. (Vangaveeti Radha) రాధాతో తమ స్నేహం గురించి ప్రముఖంగా చెప్పుకొచ్చారు. బెజవాడలో రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి రాధాను తమ వెంటే తిప్పుకున్నారు కూడా. రాధాపై రెక్కీ వార్తలతో వెంటనే అలర్ట్ అయి సీఎం జగన్ ను ఒప్పించి రాధాను 2+2 గన్ మెన్లతో భద్రతను కూడా పెంచారు.

 అవకాశాన్ని అందిపుచ్చుకున్న టీడీపీ..

అయితే.. తనకు సెక్యూరిటీ వద్దని రాధా తిరస్కరించడంతో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాధా వైసీపీలోకి రాడని అర్ధమై దిద్దుబాటు చర్యలకు దిగింది. పరిస్థితులు గమనించిన టీడీపీ రాధా వైసీపీలోకి వెళ్లట్లేదని గమనించి కాపు నాయకులు ఒక్కొక్కరిగా (Vangaveeti Radha) రాధాను కలవడం.. పరామర్భించడం.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. చంద్రబాబు సైతం రాధాను ఆయన ఇంట్లో కలిసి రాజకీయాన్ని తమ వైపుకు తిప్పుకున్నారు. రాధా రూపంలో టీడీపీకి కలసిరావడంతో కాపుల ఓట్లను ఆకర్షించాలని భావించిన వైసీపీకి దెబ్బ పడింది. రాధాపై టీడీపీ సానుభూతి చూపడంతో తమకు దెబ్బ తగలకుండా ఉండేందుకు రాధాకు వ్యతిరేకంగా వైసీపీ ఎదురుదాడి మొదలెట్టింది. మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. మరి.. రాధాను వైసీపీలోకి తీసుకురావాలనుకున్న నాని, వంశీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

author avatar
Muraliak

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju