NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ys jagan : జగన్ ఇక ఇంచార్జిల మార్పులు..! సాయిరెడ్డి ప్లేస్ లో వైవీ – కొడాలి, బాలినేనికి కీలక బాధ్యతలు..!?

ys jagan : 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వం, పరిపాలనలో మార్పులు తీసుకొచ్చిన సీఎం జగన్ ఇక పార్టీ ప్రక్షాళనపై కూడా దృష్టి పెట్టారు.. మంత్రివర్గం మార్పు ద్వారా ప్రభుత్వంలో మార్పులు.. జిల్లాల విభజన ద్వారా పాలనలో మార్పులు చేసినట్టే.. పార్టీ జిల్లాల ఇంచార్జిల మార్పు ద్వారా పార్టీ ప్రక్షాళన చేయాలనేది సీఎం జగన్ ఆలోచన.. ఈ మేరకు సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కొత్తగా ఏర్పాటైన 26 జిల్లాలను ఆరు విభాగాలుగా విభజించి ఆరుగురు కీలక నేతలకు ఇంచార్జి బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ జిల్లాల ఇంచార్జిల బాధ్యతలతో పాటూ పార్టీలో ఒక “సమన్వయ కమిటీ”ని కూడా ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి..! ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మార్పులు ఇలా ఉండవచ్చని భావిస్తున్నారు..

ys jagan : సాయిరెడ్డి పూర్తిగా పార్టీ కార్యాలయంలో.. ఆయన స్థానంలో వైవీ..!

విజయసాయిరెడ్డి ఇక పూర్తిగా పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉండేలా జగన్ భావిస్తున్నారు. పార్టీ అన్ని అనుబంధ శాఖలకు సాయిరెడ్డి అధ్యక్షుడుగా ఉండడంతో వచ్చే రెండేళ్లు ఆయనకు ఎక్కువ పని ఉంటుంది. అందుకే ఆ బాధ్యతలు ద్వారా కార్యాలయానికి పరిమితం చేయనున్నారు. ప్రస్తుతం సాయిరెడ్డి ఇంఛార్జిగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలకు కొత్త ఇంఛార్జిగా వైవీ సుబ్బారెడ్డి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. వైవీ ప్రస్తుతం ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాలకు ఇంఛార్జిగా ఉన్నారు. సో.. వైవీ ఇక ఉభయ గోదావరి బాధ్యతలు నుండి తప్పుకుని, ఉత్తరాంధ్ర చూల్సి ఉంటుంది. ఇదే సయమంలో మాజీ మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, కురసాల కన్నబాబు వంటి నేతలకు కూడా జిల్లాల ఇంచార్జి బాధ్యతలతో పాటూ పార్టీ సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం.

కొడాలి, పెద్దిరెడ్డి కలిసి చిత్తూరు..!?

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుని ఈ సారి వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలి అనుకుంటుంది. అందుకే చిత్తూరు జిల్లా ఇంఛార్జిగా ప్రస్తుతం ఉన్న వైవీ సుబ్బారెడ్డి స్థానంలో కొడాలి నానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని జగన్ భావిస్తున్నారట. పెద్దిరెడ్డి, కొడాలి నాని సమన్వయము చేసుకుని చిత్తూరు జిల్లాలో పార్టీపై ద్రుష్టి పెట్టాలని ఆలోచన.. అయితే ఇది ఎంత మేరకు అమల్లోకి తెస్తారనేది అనుమానమే. కొడాలి నాని, పేర్ని నానీల్లో ఒకరికి ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు.., ఒకరికి గుంటూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా రెండు జిల్లాలకు ఇంఛార్జిగా నియమించనున్నట్టు సమాచారం. ఇవన్నీ ప్రస్తుతం ప్రతిపాదనల, ఆలోచనల దశలో మాత్రమే ఉన్నాయి. ఈ వారం లేదా వచ్చే వారంలోగా ఫైనల్ చేయనున్నారు.

ఆపై ఎమ్మెల్యేతో సమన్వయ కమిటీ..!?

జిల్లాలకు ఇంచార్జిల నియామకం అనంతరం పార్టీ “కీలక సమన్వయ కమిటీ” ఒకటి ఏర్పాటు చేసి పదిమంది నేతలను దీనిలో భాగస్వామిగా చేయనున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేలతో మాట్లాడడం.. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షలు చేయడం.., పీకే టీం నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు సూచనలు చేయడం.. వారానికోసారి సీఎం జగన్ కి నివేదికలు అందించి.. పార్టీ పరిస్థితులపై సమీక్షించడం ఈ కమిటీ బాధ్యతగా చెప్తున్నారు.. ఈ కమిటీలో కూడా కొందరు మాజీ మంత్రులతో పాటూ.., సీనియర్ ఎమ్మెల్యేలను వేయనున్నారనిది ప్రస్తుతానికి ఉన్న సమాచారం..!

author avatar
Srinivas Manem

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju