నాలుగు నెలలు ఒపిక పట్టండి: జగన్

కడప, జనవరి 11: నాలుగు నెలలు ఒపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తా అని  వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. పాదయాత్ర అనంతరం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని శుక్రవారం కడప జిల్లాలో ప్రవేశించిన జగన్‌కు రైల్వే కోడూరు వద్ద వైకాపా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కోడూరు వద్ద 15 రోజులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువకులను ఆయన పరామర్శించారు.

అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామనీ, గ్రామ సచివాలయాల వల్లనే లక్షా 50వేల ఉద్యోగాలు వస్తాయని జగన్ అన్నారు.