NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

 జగన్ నెత్తిన కొండంత భారం .. పిడుగుగా మారేముందే జాగ్రత్తపడాలి !

ఏపీ లో పాలసీ పరంగా అభివృద్ధి శూన్యం అని ఇటీవల నీతి అయోగ్ తేల్చిచెప్పింది. కాగా కనీస పోర్టులు లేని తెలంగాణ రాష్ట్రం ఆరవ స్థానంలో ఉంటే, 12 పోర్టులు కలిగి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ 20వ స్థానంలో ఉందని ఏపీ సర్కార్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ద్వజమెత్తారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పెట్టిన పరిశ్రమలను రాష్ట్రం నుండి వెళ్ళి పోయేలా వ్యవహరించారని, ఇక్కడ ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే భయపడే రీతిలో ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Andhra Pradesh CM YS Jagan writes to Centre about Population Register,  requests NPR update to be as in 2010 formatఇటీవల నీతి అయోగ్ రిలీజ్ చేసిన ఎగుమతుల సన్నద్దతలో ఏపీ 20వ స్థానంలో ఉండటం దారుణమని, ఎనిమిది తీరప్రాంత రాష్ట్రాలలో, ఏపీ ఏడవ స్థానంలో ఉండటం బట్టి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్పష్టంగా అర్థం అవుతుంది అంటూ యనమల విమర్శించారు. ఇదే విషయాన్ని నీతి అయోగ్ చెప్పిందని తీరప్రాంత రాష్ట్రమైన పాలసీ పరంగా ఆంధ్రప్రదేశ్ పనితీరు నాసిరకంగా ఉంది అన్నట్లు నీతి అయోగ్ చెప్పినట్లు యనమల చెప్పుకొచ్చారు.

 

కక్షపూరితంగా పరిపాలన చేయడం వల్లే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని తూర్పు రాబట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్పులు చేయడానికి ఉన్న అన్ని అవకాశాలు వాడేసిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా కరోనా కష్టకాలంలో ఆదాయం ఏమీ రాకపోవటంతో…. కేంద్రానికి కూడా ఆదుకునే పరిస్థితి లేకపోవడంతో రాబోయే రోజుల్లో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో చాలా కోత విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

ఇప్పటికే పెట్రోల్ పై అదనపు చార్జీలను పెంచిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో….. ఆదాయం సమకూర్చుకోవడానికి మరో పెద్ద పన్ను ఏదైనా వెయ్యొచ్చు అని భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే డబ్బులు పంచుకుంటూ పోతే ఇక ప్రభుత్వ కార్యక్రమాలు చేసేది ఏమీ ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు.ఇచ్చిన హామీలు కొండంత ఉంటే రాబడి గోరంత ఉన్న తరుణంలో…. ప్రజలనుండి వ్యతిరేకత పిడుగు లాగా మారకముందే …జగన్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది అని లేకపోతే పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.  

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju