సంకల్ప యాత్ర ముగింపు రోజే వైకాపా అభ్యర్థుల ప్రకటన ?

అమరావతి, డిసెంబర్ 29: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ పాదయాత్ర జనవరి 9 లేదా 10 తేదీల్లో ఇచ్ఛాపురం వద్ద ముగియనుంది. అదే రోజు జరిగే బహిరంగ సభలో 100 నుండి 105 అసెంబ్లీ, పది నుండి 15 పార్లమెంట్ స్థానాల అభ్యర్ధులను ప్రకటించే అవకాశం
ఉంది. పాదయాత్ర ముగిసిన అనంతరం జగన్ తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని  తదుపరి కడప దర్గాలో ప్రార్థనలు చేయనున్నట్లు సమాచారం.