జ‌గ‌న్ మోదీ ఇద్ద‌రు ఒక్క‌టే

Share

కాకినాడ జ‌న‌వ‌రి3: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోదీ ప్రజలను మోసం చేశారన్నార‌ని ఆయ‌న అన్నారు.

గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా ఎండపల్లిలో నిర్వహించిన జన్మభూమి – మాఊరు కార్యక్రమంలో పాల్గొన్నా 4.5 కోట్ల రూపాయ‌ల వ్యయంతో నిర్మించిన విపత్తు పునరావాస కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. వైకాపా అధినేత జగన్‌, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి చంద్రబాబును అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పోలవరం నిధులు విడుదలలో కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ తాము నెరవేర్చామని, మేనిఫెస్టోలో పెట్టని పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల్ని సైతం పూర్తి చేసినట్టు యనమల చెప్పారు


Share

Related posts

కరోనా కట్టడికి ప్రజలు వినూత్నంగా పంట పొలాల్లో ఇల్లులు

Siva Prasad

ఆ జబర్దస్త్ కమెడియన్ ని పొగడ్తలతో ముంచెత్తిన రేణు దేశాయ్..!!

sekhar

విజయవాడ లో కరోనా సోకిన పానీపూరి వ్యాపారి

Siva Prasad

Leave a Comment