NewsOrbit
రాజ‌కీయాలు

రాజోలు రాజకీయం జగన్ కు పాఠమా..?

jagan next step on razole about janasena mla

రాష్ట్ర రాజకీయాల్లో రాజోలు రాజకీయం విచిత్రాంగా ఉంది. జనసేన పార్టీ గెలుచుకున్న ఏకైక ఎమ్మెల్యే స్థానం రాజోలు. ఇక్కడి నుంచి రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాపాక ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 318 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో జనసేనలో చేరి అనూహ్యంగా ఎమ్మెల్యే అయిపోయారు. జనసేన నుంచి గెలిచినా ఆయన వైసీపీ వైపు, జగన్ వైపే మాట్లాడేవారు. ఇప్పుడు డైరక్ట్ గానే జగన్ వైపు ఉన్నట్టు చెప్పేశారు. దీంతో ఆయనకు జగన్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందని అర్ధమవుతోంది. మరి రాజోలు వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న బొంతు రాజేశ్వరరావు పరిస్థితిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

jagan next step on razole about janasena mla
jagan next step on razole about janasena mla

వరుస రెండు ఎన్నికల్లోనూ ఓటమి..

రాజోలులో 2014, 2019లోనూ వైసీపీ గెలవలేక పోయింది. రెండు సార్లూ బొంతు రాజేశ్వరరావే పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లోనే వైసీపీ లేదా టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో 2014 ఎన్నికల్లో రాపాక స్వతంత్రంగా పోటీ చేసి ఏమాత్రం ఉనికి చాటుకోలేకపోయారు. దీంతో తనకు రాజకీయ గుర్తింపు రావాలంటే ఓ పార్టీ గుర్తు ఉండాలని భావించి జనసేనలో చేరిపోయారు. పవన్ మ్యానియాతో ఆయన ఏకంగా ఎమ్మెల్యే అయిపోయారు. నిజానికి 2019లో కూడా రాపాక వైసీపీ లేదా టీడీపీ నుంచి టికెట్ ఆశించినట్టు తెలుస్తోంది.

జగన్ కు తలనొప్పి ఎక్కడ.. ఆయన చేయాల్సింది ఏమిటి..

వైసీపీ నుంచి బొంతు రాజేశ్వరరావుకు రాజోలులో మంచి పేరు ఉన్నా అక్కడ రెండు సార్లు ఓడిపోయారు. స్థానిక నాయకత్వం, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అసెంబ్లీకి వెళ్లాలన్న బొంతు కోరిక నెరవేరలేదు. అయితే.. ఇప్పుడు జగన్ కు మద్దతుగా ఉన్న రాపాక ఉండడంతో నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పే పరిస్థితి వచ్చింది. అయతే.. పదేళ్లుగా తననే నమ్మిన బొంతును జగన్ పక్కన పెట్టలేని పరిస్థితి. దీంతో అక్కడ ఏం చేయాలో జిల్లా పార్టీ పరిశీలకుడు వైవీ సుబ్బారెడ్డికి జగన్ బాధ్యతలు అప్పజెప్పారని తెలుస్తోంది. మరి.. ఎవరికి ఏమి దక్కుతుందో వేచి చూడాల్సిందే.

 

 

author avatar
Muraliak

Related posts

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?