“టీడీపీ అవినీతి” పై జగన్ పుస్తకావిష్కరణ

శ్రీకాకుళం, జనవరి6: టీడీపీ అవినీతి పాలన అంటూ దానిపై ఒక పుస్తకాన్ని వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆదివారం శ్రీకాకుళంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతిని  పుస్తకంలో పొందుపరిచామన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో సిఎం చంద్రబాబునాయుడు 6.17 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని జగన్ ఆరోపించారు. ఆయన అవినీతి పాలనపై తాము ముద్రించిన పుస్తకాన్ని రాష్ట్రపతి, ప్రధానితోపాటు…అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, రాజకీయ పార్టీల నాయకులకూ అందజేస్తామని ఆయన చెప్పారు