పోలవరం పూర్తి చేయడానికి కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో జగన్ సర్కార్..!!

తండ్రి దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి కలలుకన్న ప్రాజెక్ట్ అదే విధంగా ముఖ్యమంత్రి అయ్యాక జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ పోలవరం. కాగా  పోలవరం విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇక మాకు పోలవరం తో సంబంధం లేదు, ఇంతే ఇస్తామని క్లారిటీ ఇవ్వటం జరిగింది. మరోపక్క ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయే పూర్తి అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఈ పోలవరం ప్రాజెక్టును ఎలా కంప్లీట్ చేస్తారు అన్నది చాలా ప్రశ్నార్థకంగా మారింది. అసలే భారీ మెజార్టీతో గెలిపించి ప్రజలు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది.

YS Jagan's first reverse tendering saves Rs 58.53 cr in Polavaramప్రతిపక్ష నేతగా ఉన్న సమయములో పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ అవినీతి చేసింది అని తెగ గగ్గోలు పెట్టడం జరిగింది. కాగా అధికారంలోకి వచ్చాక 2021 లోపు పూర్తి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా ఇప్పటికే కేంద్రం చేతులెత్తేయడంతో పాటు మరోపక్క రాష్ట్రంలో రాబడి లేని పరిస్థితి ఉండటంతో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవడం అనేది అసంభవంగా నెలకొంది ప్రతి ఒక్కరిలో. న్యాయబద్ధంగా విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన పోలవరాన్ని కేంద్రం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ టిడిపి ప్రభుత్వం అప్పట్లో కమీషన్లకు కక్కుర్తిపడి.. పోలవరం ప్రాజెక్టులు మేమే పూర్తి చేస్తామని భుజాన వేసుకోవటం ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి గుదిబండగా మారింది.

 

ఇదిలా ఉండగా ఎలాగైనా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రాన్ని ఇప్పిస్తామని నిధులను తెచ్చుకుందామని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. మోడీ సర్కార్ వైఖరి చూస్తే ఒక్కసారి చెబితే మాట వెనక్కి తీసుకోవటం అనేది చరిత్రలో లేదు. ఇలాంటి తరుణంలో జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇక అప్పులు చేయాల్సిన పరిస్థితి అనే రీతిలో తాజాగా ఆలోచన చేస్తున్నట్లు సరికొత్త టాక్ ఏపీ ప్రభుత్వ వర్గాల్లో వినబడుతోంది.