NewsOrbit
Featured రాజ‌కీయాలు

లోగుట్టు జగన్ కే ఎరుక…! లీకులు.., లాబీయింగులు ఉండవు…!

రాజకీయాల్లో… రాజకీయ పార్టీల్లో లీకులూ.., లాబీయింగులు బాగా పని చేస్తుంటాయి…! జాతీయ పార్టీల్లో ఇవి బాగా ఎక్కువ ఉంటాయి. ప్రాంతీయ పార్టీల్లో అయితే కోటరీల ద్వారా బయటకు వస్తుంటాయి..! కానీ అన్నిటికీ భిన్నం వైసీపీ పార్టీ. లీకులు ఉండవు. ఉంటె అవుట్. లాబీయింగులు ఉండవు.., ఉంటె జగన్ దగ్గర మెట్టు దిగినట్టే.., కోటరీ ఉండదు. ఉన్న ముగ్గురు రెండో స్థాయి నాయకులు కూడా ఎవరి బాధ్యతల్లో వాళ్ళు ఉండాలి. లేకపోతే వారికే దిక్కుండదు. అదే మరి జగన్ అంటే…!

పాపం వైసీపీ ఎమ్మెల్యేలు…! పాపం వైసీపీ సీనియర్లు…! కళ్ళెదురుగా రెండు మంత్రి పదవులు ఉన్నాయి. ఎవరికీ ఇస్తారో తెలియదు. లీకు లేదు. లాబీయింగుకి అవకాశం లేదు. లీకులు చేయిస్తే… అది అధినేతకు తెలిస్తే కటీఫ్ తప్పదు. పోనీ లాబీయింగ్ చేయిస్తే ఎవరి దగ్గర ఆపని చేయదు. అందుకే ఆ రెండు మంత్రి పదవులు ఎవరికీ ఇస్తారా ఏంది చూసుకుంటూ… అందరు సాధారణ కార్యకర్తల్లాగానే… వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులూ కూడా ప్రశ్న గుర్తు మొహం పెట్టుకుని ఉండాల్సిందే.

 

ఇద్దరు బిసిలు రాజీనామా చేశారు. మరి ఇప్పుడు బిసిలనే తీసుకుంటారా…? ఏమో కాపులకు మరో స్థానం ఇస్తారేమో.., ఏమో రెడ్డిలకు ఇంకో మంత్రి ఇస్తారేమో…! లేదు లేదు కమ్మకి వ్యతిరేకం అని అంటున్నారుగా.. కమ్మ వాళ్ళకి ఒక మంత్రి ఇచ్చేస్తారేమో…! అవన్నీ కాదు, జగన్ కు తోలి నుండి తోడున్నది ఎస్సి, ఎస్టీలు అందుకే జగన్ ఈ సారి వారికే ఇస్తారు…! ఇలా అనేక ఊహాగానాలు, అనేక విశ్లేషణలు. ఎవరికీ తోచినట్టు వారు రాస్తూ, మాట్లాడుతూ, చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. జగన్ కి మాత్రమే తెలుసు. ఎవరికీ ఇస్తారో, ఎవరికీ ఇవ్వాలో. ఇప్పటికీ ఆయనకి ఒక అవగాహనా వచ్చి, ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. బహిరంగంగా వెల్లడించే ముందు మాత్రమే విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి పెద్దలకు చెప్తుంటారు. ఈ లోగా ఫలానా వారికీ ఇద్దాం అని ఎవరు వెళ్లి చెప్పినా వైన్ రకం జగన్ కాదు.

ఇది నియంతృత్వం అనుకోని, ఏకఛత్రాధిపత్యం అనుకోని.. ఏదైనా కానీ. వైసిపి పార్టీలో, ప్రభుత్వం లో పూర్తి నిర్ణయాలు జగన్ వె. ఎవరు చెప్పినా వినరు. ఎవరూ చెప్పే సాహసం చేయరు. ఇలాగే తమిళనాడులో జయలలిత చేసేవాళ్ళు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నా, పార్టీ అధినేత్రిగా అయినా ఆమె ఏం చెప్తే అదే శాసనం. ఎవరైనా లాబీయింగు చేసిన, లీకులు చేసినా వారికి మూడినట్టే. ఏపీలో చంద్రబాబు ఆ తరహాలో ప్రయత్నం చేసినప్పటికీ ఆయన పార్టీలోని కొందరు నాయకులకు తలొగ్గి ఉంటారు. ఆయన చుట్టూ కోటరీ ఏర్పాటు చేసుకుని అందులోనే ఉంటారు. పార్టీలో నిర్ణయం సొంతంగా కంటే వీళ్ళు చెప్పిందే చేస్తుంటారు. జగన్ మాత్రం తనే మొత్తం.

author avatar
Srinivas Manem

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!