తెలిసి తెలిసి పెద్ద తప్పు చేసిన జగన్..?? దీన్ని రిజల్ట్ గట్టిగానే ఉండబోతుంది..!!

విభజనతో నష్టపోయే ఆర్ధికంగా అనేక కష్టాలను ఎదుర్కొంటోంది ఆంధ్ర ప్రదేశ్ ఖజానా. ఇటువంటి తరుణంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ఖజానా కి బాగా లాభం చేకూర్చే మద్యం విషయంలో ముందు నుండి ఎటువంటి లాభాన్ని ఆశించకుండా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి రావడం తోనే బెల్టుషాపులు లేకుండా చేసిన జగన్ తర్వాత మద్యం దుకాణాలు క్రమ క్రమంగా తగ్గించుకుంటూ సమయాన్ని కూడా చాలావరకు తగ్గించేశారు.

CM Jagan Mohan Reddy to launch YSR Jala Kala scheme- The New Indian Expressఅయితే ఈలోపు కరోనా వైరస్ రావటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఆదాయం చాలా వరకు తగ్గిపోయింది. పైగా అక్రమ మద్యం పక్క రాష్ట్రాల నుండి ఎక్కువైపోయింది. దీంతో ఏపీ ఖజానా కి చాలా పెద్ద నష్టం వచ్చి పడినట్లయింది. రాష్ట్రానికి ఆదాయం వచ్చే మద్యం విషయంలో తెలిసి తెలిసి సీఎం వైఎస్ జగన్ పెద్ద తప్పు చేసినట్లే ఉందని తాజా పరిస్థితులపై పరిశీలకుల మాట. రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న పక్క రాష్ట్రాల నుండి మందుబాబులు దర్జాగా తెచ్చుకోవడం వల్ల జగన్ తీసుకున్న కఠిన నిర్ణయాలు అట్టర్ ఫ్లాప్ అయినట్లే అని అంటున్నారు.

 

అంతే కాకుండా ఇలాంటి నిర్ణయాల వల్ల ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల ఖజానకి మరింత లాభం చేకూర్చినట్లే అని అంటున్నారు. అంతేకాకుండా ఏపీ మద్య నియంత్రణ చర్యల రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి గట్టిగానే నష్టం చేకూర్చే విధంగా భవిష్యత్తు ఉండబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ ఖజానా గాడిలో పడాలంటే మద్యం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు పక్కనపెడితే బెటర్ అనే టాక్ వస్తోంది. ఈ విషయంలో సీనియర్ మంత్రులు కూడా జగన్ కి సర్దిచెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.