టిడిపితో పోత్తు కొనసాగాల్సిందే: జగ్గారెడ్డి

హైదరాబాద్, జనవరి 6: తెలుగుదేశం పార్టీ పొత్తుతో మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్‌కు ప్రత్యక్షంగా జరిగిన నష్టం ఏమీ లేదని సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ్యుడు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పొత్తు వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం టిఆర్ఎస్‌కు ఒటు వేశారని అన్నారు. ఈ కారణంగానే హైదరాబాద్‌లో మహాకూటమికి నష్టం కలిగిందని ఆయన తెలిపారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిడిపితో పొత్తు ఉండాల్సిందేననీ ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత ఉత్తమ్‌కుమార్ పొత్తు వద్దని చెప్పడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయ్యుండ వచ్చని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
తెలంంగాణా ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షపదవిలో తనను నియమించాల్సిందిగా పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు జగ్గారెడ్డి తెలిపారు.