NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు .. బస్సు యాత్ర వాయిదా .. ఎందుకంటే..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు వైసీపీపై, తన బస్సు యాత్ర పైన కీలక వ్యాఖ్యలు చేేశారు. రాష్ట్రంలో అక్టోబర్ 5వ తేదీ నుండి బస్సు యాత్ర ప్రారంభించాలని ముందుగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల అయ్యింది. కానీ బస్సు యాత్ర ను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలన్న సంకల్పంతో బస్సు యాత్రను వాయిదా వేసుకున్నారు. ఈ లోపుగా కౌలు రైతు భరోసా యాత్ర, జనవాణి కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆదివారం జనసేన లీగల్ సెల్ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్.. రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై జోస్యం చెప్పారు. ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 47 నుండి 67 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ ప్రజలకు, ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. హామీలను నెరవేర్చని అధికార పార్టీకి చట్టాలు చేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.

Pawan Kalyan

 

2019 ఎన్నికల్లో ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే వైసీపీకి ఓటువేశారో కానీ దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. 2014 ఎన్నికల్లో తాను గుడ్డిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేదని చెప్పారు. రాజధాని విషయంలో ఆనాడే తన వైఖరి స్పష్టం చేశానని అన్నారు. భారీ స్థాయిలో వేల ఎకరాల్లో కాకుండా చిన్న రాజధాని ఏర్పాటు చేయాలని నాటి టీడీపీ ప్రభుత్వానికి సూచించానని చెప్పారు. కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి 30వేల ఎకరాలు అవసరం అని చెప్పి అమరావతి లో రాజధానికి ఓకే చెప్పారన్నారు. చట్ట సభలో మాట ఇచ్చి వెనక్కి పోతే ఇక విలువ ఏమి ఉంటుందని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, అమరావతిని అభివృద్ధి చేస్తానని అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత మాట తప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో వివాదాన్ని రేపడంతో నేడు ఏపికి రాజధాని లేకుండా పోయిందన్నారు. తెలుగు రాష్ట్రాల ఆస్తుల పంపకంలో జగన్ కు శ్రద్ద లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం అధికంగా ఉందని ఆరోపించారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan
Pawan Kalyan

 

రాష్ట్రంలో జనసేన పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వేగంగా అధికారాన్ని అందుకోవడం తమ లక్ష్యం కాదనీ పేర్కొన్న పవన్ కళ్యాణ్.. మహనీయుడు ఎన్టీఆర్ తో పోటీ పడలేమని, మార్పు కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపారు. పార్టీలు నిలబడాలంటే బలమైన సిద్ధాంతాలు ఉండాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ వదిలేసి పారిపోతారని చాలా మంది ఆశించారనీ, కానీ వారి కోరిక నెరవేరకుండా చేశానని చెప్పారు. అణగారిన వర్గాలకు అధికారం దక్కేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. గత ఎన్నికల్లో అసెంబ్లీలో కనీసం పది స్థానాలు వచ్చినా తమ పోరాటం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలని అన్నారు. జనసైనికులు పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. జనసేనకు బలమైన స్థానాలు గుర్తించి అక్కడ బాగా పని చేయాలని సూచించారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగే అభ్యర్ధులను ఎంపిక చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. త్వరలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

Read More: ఏపి రాష్ట్ర వ్యవస్థ బేషూగ్గా ఉన్నా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ సీఎం వైఎస్ జగన్ మండిపాటు

author avatar
sharma somaraju Content Editor

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N