NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Janasena Party: సేన సినిమా మొదలైనట్టేనా..!? పవన్ ప్రణాళికలేమిటి..!?

janasena party started conquering in ap

Janasena Party : జనసేన పార్టీ Janasena Party జనసైనికులు సినిమా మొదలెట్టాశారు. మిగిలింది రాజకీయ తెరపై పవన్ ప్రణాళికలే. వేల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందనేది నిర్వివాదాంశం. ఇక గమ్యం నిర్దేశించుకుని వేసే అడుగులో.. సంకల్ప బలం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం కాదు. ఏ రంగంలో ఉన్నవారికైనా ఇదే వర్తిస్తుంది. అయితే.. అత్యంత క్లిష్టమైన సినిమా, రాజకీయ వైకుంఠపాళిలో పోటీ మరింత ఎక్కువగా ఉంటుంది.

నిచ్చెనలు ఉంటాయి.. పాములూ ఉంటాయి. పాము కాట్లను తప్పించుకుని నిచ్చెనలు ఎక్కుతూ వెళ్లాల్సి ఉంటుంది.. లేదా ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడిదే పని జనసన చేస్తోంది. అధినేత పవన్ కల్యాణ్ ను కూర్చోబెట్టి కాగల కార్యాన్ని నెరవేర్చే పనిని జనసైనికులే తీసుకున్నారు. ఇటివలి పంచాయతీ ఎన్నికల్లో జనసేన సాధిస్తున్న పంచాయితీలే ఇందుకు నిదర్శనం. పవన్ పై ఉన్న నమ్మకం.. ను గెలిపించాలనే వారి తపన ఆసక్తికరంగా మారింది.

janasena party started conquering in ap
janasena party started conquering in ap

జనసైనికులే.. అంతా తామే అయి..

జనసేన పార్టీని పవన్ కల్యాణ్ స్థాపించినప్పుడు ఉన్న ఉత్సాహమే పవన్ అభిమానుల్లో ఇప్పటికీ ఉంది. ఆ పార్టీలోకి వచ్చిన ఇతర నాయకులు.. ఆ పార్టీతోనే రాజకీయ పయనం ప్రారంభించిన వారు ఇప్పుడు పెద్దగా పవన్ తో లేరు. మధ్యలోనే వెళ్లిపోయారు. 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీకి సపోర్ట్ ఇచ్చినా వెన్నంటి ఉన్నవారు 2019లో జనసేన సొంతంగా పోటీ చేసినా లేకపోయారు. పైగా 2019 ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయంతో పవన్, జనసైనికులు తప్ప పెద్దగా ఎవరూ మిగల్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న జనసేనను పవన్ చూసి జనసైనికుల్లో కసి పెరిగింది. నాయకులతో కాదు.. తామే సైనికులై పార్టీని నిలబెట్టాలనే లక్ష్యంతో పవన్ పై నమ్మకంతో పని చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలకు కూడా కావల్సింది గ్రామస్థాయిలో బలం. అటువంటి బలాన్ని పంచాయతీ ఎన్నికల ద్వారా నిరూపించింది జనసేన. 2018 మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో.. 2019లో మరోసారి పవన్ తన ప్రసంగంలో.. ‘పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా.. అప్పుడు చూపిస్తాం మా పవర్’ అన్నారు. నిజంగానే పవర్ చూపించి పంచాయతీలు గెలుచుకోవడం వైసీపీ, టీడీపీలకు షాకిచ్చేదే.

 

పంచాయతీ ఎన్నికలు పెద్ద బూస్టప్..

నిజానికి.. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పెద్దగా జనసైనికులకు దిశా నిర్దేశం చేసింది కూడా ఏమీ లేదు. నూనుగు మీసాల యువకుల నుంచి పెద్ద వయసు వాళ్లు.. యువతుల నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకూ జనసేన తరపున జనసైనికులే పంచాయతీల్లో అభ్యర్ధులుగా నిలబెట్టారు. జనసేన జెండా, అజెండా.. పవన్ ఫొటోను వెనుకబెట్టుకుని ముందుకు వెళ్లారు. పార్టీల గుర్తులు పని చేయని ఈ ఎన్నికల్లో పవన్ నామస్మరణే ఈ విజయాన్ని కట్టబెట్టాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన 23 శాతం ఓటింగ్ సాధించిందని పవన్ కల్యాణ్ ప్రకటించారంటే ఈ విజయం జనసేనకు చాలా పెద్ద బూస్టప్ అని చెప్పాలి. కడప, చిత్తూరు, కుప్పం, అరకు, పశ్చిమగోదావరి.. ఇలా మొత్తంగా 270 పంచాయితీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు దక్కించుకుని, 1654 స్థానాల్లో జనసేన రెండో స్థానంలో నిలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. పవన్ చాలా పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే..

 

ఇక పవన్ చేయాల్సింది ఇదే..

ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్య పవన్ దే. టీడీపీతో పొత్తు చాలా పెద్ద మైనస్. ఆ తర్వాత వామపక్షాలు, బీఎస్పీ.. ఇప్పుడు బీజేపీతో పొత్తు జనసేన సత్తాను కాస్త సన్నగిల్లేలా చేస్తున్నాయి. పవన్ బలంతో ఎన్నికలకు వెళ్దామని చూస్తున్న బీజేపీ పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు తోడు లేదు. జనసేన సాధించిన విజయంలో ఒక్క శాతం కూడా బీజేపీ సొంతంగా సాధించలేదు. ఇదే విషయాన్ని తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా పవన్ వద్ద ప్రస్తావించిన జనసైనికు వాదన ఇప్పుడు నిజమైంది.

ఈ విషయంలో జనసైనికుల సమరోత్సాహాన్ని పవన్ సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చింది. జీహెచ్ఎంసీలో నామినేషన్లు ఉపసంహరించుకోండి.. ఈ ఒక్కసారికి నా మాట వినండి అన్నారు పవన్. ఇలాంటి పొరపాట్లు పవన్ పూర్తిగా తగ్గించుకోవాల్సి తరుణం వచ్చింది. గ్రామస్థాయిలో జనసేనకు ఉన్న పవర్ ప్రూవ్ అయింది కాబట్టి.. దీనిని మరింత పటిష్టపరచాలి. పట్టణాలు, నగరాల్లో జనసేనను బలంగా తీసుకెళ్లాలి. జనసైనికులకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా పవన్ వ్యూహాలు ఉంటే జనసైనికులకు పవన్ ఏమీ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారనే డైలాగ్ లా.. జనసైనికులే పవన్ ని అందలం ఎక్కిస్తారు.

 

 

 

author avatar
Muraliak

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk