NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలోకి కీలక నేతలు..!? సంక్రాంతి తర్వాత వలసలు షురూ..!!

TDP Inside ; Seniors Secret meet in TDP?

Andhra Pradesh lo టీడీపీ Telugu Desam Party ఓడిపోయి ఏడాదిన్నర గడిచింది. ఆ పార్టీ నాటి నుండి నిద్రలోకి జారుకుంది. దాన్ని శాశ్వత నిద్రలోకి తోసెయ్యాలని వైసీపీ YSR Congress Party  ఉవ్విళ్లూరుతోంది. టీడీపీ స్థానాన్ని ఆక్రమించేయాలని బీజేపీ ఊహలు వేసుకుంటుంది..! కానీ టీడీపీ అంటే Chandrababu Naidu చంద్రబాబు. చంద్రబాబు అంటే ఫక్తు పొలిటీషియన్. కన్నింగ్ తో నిండిన రాజకీయాలకు AP Politics పెట్టింది పేరు. పార్టీని ఎలా నిలబెట్టుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన నేత..! అందుకే పార్టీని బతికించుకునే ఆంతరంగిక ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయిందేదో అయింది అంటూ..! జమిలి ఊహలతో.., వైసీపీ వ్యతిరేకత ఆశలతో.., కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు..!!

AP Politics: Cyber Crimes Game

చేరికలతో ఊపు కోసం..!!

టీడీపీలోకి ఇప్పుడు కొంత జోష్ కావాలి. ఓటమిని మర్చిపోయి, జగన్ వేస్తున్న దెబ్బలను మర్చిపోయి, పార్టీ కోసం మళ్ళీ చురుకుగా పని చేయాలి. అది జరగాలి అంటే పార్టీకి కొంత జోష్ తీసుకురావాలి. అంటే కొత్త వాళ్ళు పార్టీలోకి రావాలి. అందుకే పార్టీ పెద్దలు ప్రయత్నాలు ఆరంభించారు. బీజేపీ, కాంగ్రెస్ లో మాజీలు, అసంతృప్తులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అన్నీ ఒకే అయితే కొందరు కీలక నేతలు టీడీపీలోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. సంక్రాంతి తర్వాత కొన్ని చేరికలు చేసి.. మర్చి, ఏప్రిల్ నాటికి పార్టీ చైతన్య యాత్రలు చేపట్టి.., మళ్ళీ వాసివైచె ఏడాది నవంబరు నాటికి రెండో దశలోనూ జన చైతన్య యాత్రలు చేయాలి అనేది బాబొరి ఆలోచన. అందుకే ఈ లోగా 175 నియోజకవర్గాల్లో ఇంచార్జిలను చూస్తున్నారు. పార్టీ అంతర్గత అధ్యయనం ప్రకారం రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో టీడీపీ కి ఇంచార్జిల లోటు ఉంది. కొన్ని చోట్ల లేరు, కొన్ని చోట్ల ఉన్నప్పటికీ డమ్మీలే ఉన్నారు. అందుకే నెమ్మదిగా ఇంచార్జిలను నియమించేసి పార్టీని చురుకు చేయాలి అనేది బాబు బృందం ఆలోచన..!

చేరేది వీళ్లేనా..!?

టీడీపీలో ఎవరెవరు చేరే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక చర్చ నడుస్తుంది. బీజేపీలో కీలకంగా పని చేసి.. గత ప్రభుత్వంలో బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్న విష్ణుకుమార్ రాజు టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఆయన ప్రస్తుతం బీజేపీపై అసంతృప్తిగా ఉన్నారు. జగన్ పై రగిలిపోతున్నారు. బీజేపీలో అందరి కంటే ఎక్కువగా, ఘాటుగా జగన్ ని విమర్శిస్తున్నది ఆయనే..! అక్కడ టీడీపీకి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉన్నప్పటికీ.. ఆయన మూడు పార్టీల కూడలిలో ఉన్నారు. సందు చూసుకుని టీడీపీ నుండి జంప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే గంటాకు ప్రత్యామ్నాయంగా విష్ణుకుమార్ రాజుని టీడీపీ తీసుకువచ్చే ఆలోచనలో ఉంది.
* మరోవైపు కడప జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసి రెడ్డి కూడా టీడీపీవైపు చూస్తున్నట్టు సమాచారం. ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు పార్టీలు మారలేదు. సంప్రదాయ కాంగ్రెస్ నాయకుడు ఆయన. కానీ.., కాంగ్రెస్ ఇక పైకి లేచా అవకాశం లేకపోవడం… జగన్ అంటే తులసిరెడ్డికి ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో టీడీపీలోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. టీడీపీ వైపు నుండి కూడా తులసిరెడ్డి రాకకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో ఇటువంటి లీడర్ తో టీడీపీకి ఊపు వస్తుందని భావిస్తున్నారు.


* ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలోకి రావడం దాదాపు ఖరారయింది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆయన 2015 లో టీడీపీలోకి వచ్చారు. మళ్ళీ 2019 లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వైసిపికి వెళ్లిపోయారు. ఇప్పుడు వైసీపీ కూడా పట్టించుకోకపోవడంతో మళ్ళీ టీడీపీలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా అంగీకరించడంతో సంక్రాంతి తర్వాత ఈ చేరిక ఉండవచ్చు అంటున్నారు.
* తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే నారాయణమూర్తి కూడా టీడీపీకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన 2014 లో టీడీపీ తరపున గెలిచి.., 2019 లో వైసీపీ కి వెళ్లారు. అక్కడ తగిన గుర్తింపు లేకపోవడంతో ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వచ్చేయాలని చూస్తున్నారు. ఈయన కూడా సంక్రాంతి తర్వాత డేవిడ్ రాజుతో కలిపి చేరే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. వీరితో పాటూ కొందరు బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయి..!!

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju