Jr.NTR : టాలీవుడ్ స్టార్ హీరోలను యంగ్ టైగర్ ఒకరు.. ఒకవైపు వెండితెరపై మెరుపులు మెరిపిస్తూనే.. అప్పుడప్పుడు బుల్లితెరపై పలు రియాలిటీ షో లలో సందడి చేస్తున్నారు.. బిగ్ బాస్ షో తో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన ఎన్టీఆర్.. తాజాగా ఎవరు మీలో కోటీశ్వరుడు షో తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వచ్చేస్తున్నాడు.. తాజాగా మీ షో ప్రోమో హైదరాబాదు లో విడుదల చేశారు.. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మీడియా తో మాట్లాడారు.. విలేకరులు రాజకీయ రంగ ప్రవేశం గురించి అడగాలా సున్నితంగా జవాబిచ్చారు ఎన్టీఆర్..!!
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ.. కొద్ది కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పురపాలక సంఘాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు కూడా పార్టీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ రావాలి.. జూనియర్ ఎన్టీఆర్ రావాలి.. అంటూ నినాదాలు చేశారు. విలేకరులు కూడా పలు సందర్భాల్లో రాజకీయాల గురించి మాట్లాడమని జూనియర్ ఎన్టీఆర్ ని అడుగగా ఆయన సున్నితంగా తిరస్కరించారు ఉంటూ వచ్చారు..
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ను పలువురు మీడియా ప్రతినిధులు రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు అని అడగగా.. ఈ ప్రశ్న మీరు నన్ను చాలా సార్లు అడిగారని.. నా సమాధానం కూడా మీకు తెలుసని.. ఇది సమయం, సందర్భం కాదని అన్నారు. మనమంతా ఒక రోజు సరదాగా ఉదయం పూట కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందామని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.