NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Junior NTR: చంద్రబాబుకు భారీ షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ అభిమానులు…! బాబు ఇలాకాలో తారక్ ఫ్యాన్స్ హంగామా..!!

Junior NTR: Saved TDP.. And Saved Self by One Decision

Junior NTR: టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా కుప్పంలో ఇటీవలే వైసీపీ  ( YCP )ఘన విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల్లోనూ కుప్పం నియోజకవర్గంలో వైసీపీ హవా చాటింది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కుప్పం మున్సిపాలిటినీ వైసీపీ గెలుచుకుంది. ఈ దెబ్బ నుండి టీడీపీ  (TDP )కోలుకోకముందే కుప్పం వేదికగా ఆదివారం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద హంగామా చేశారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మువీ రిలీజ్ ఏమీ లేదు. కానీ పెద్ద ఎత్తున తారక్ ఫ్యాన్స్ కుప్పం వేదికగా చేసుకుని “జై ఎన్టీఆర్,. సీఎం ఎన్టీఆర్, బాబులకే బాబు తారక్ బాబు” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది.

Junior NTR fans kuppam
Junior NTR fans kuppam

Junior NTR: కుప్పంలో అభిమానుల సందడి

ఇటీవల టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి. మేనత్త భువనేశ్వరిని దూషించిన వారిపై జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని విమర్శించారు. వర్ల రామయ్య వ్యాఖ్యలను పలువురు టీడీపీ నేతలు సమర్ధించారు. అయితే టీడీపీ నేతల వ్యాఖ్యలు జూనియర్ ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించాయి. దాంతో నేడు కుప్పంలో తారక్ అభిమానులు “సీఎం ఎన్టీఆర్, జై ఎన్టీఆర్” అని నినాదాలు చేస్తూ సందడి చేశారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తారక్ అభిమానులు ఈ కార్యక్రమాన్ని వాళ్లంతట వాళ్లే ఏర్పాటు చేసుకున్నారా?. లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే దానిపై టీడీపీ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

 

ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం, దానిపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, నందమూరి ఫ్యామిలీ మొత్తం స్పందించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ పరిణామాల నేఫథ్యంలో వైసీపీ నేతలు మాత్రం తాము భువనేశ్వరిని అవమానిస్తూ ఏమి మాట్లాడలేదని చెప్పుకున్నారు. అయితే ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ విడుదల చేసిన వీడియోపై టీడీపీ నేతలు పెదవి విరిచారు. జూనియర్ నుండి ఆశించిన స్థాయిలో రియాక్షన్ రాలేదని నొచ్చుకున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!