రాజ‌కీయాలు

KA Paul: రాహుల్ హామీ లపై కేఏ పాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!!

Share

KA Paul: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ గత కొద్ది రోజుల నుండి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో… ఇప్పటికే ప్రధాన పార్టీలు.. ఎవరికి వారు వ్యూహాలు పన్నుతున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అల్ రెడీ  పాదయాత్ర స్టార్ట్ చేయటం తెలిసిందే. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఇటీవల రెండు రోజుల పర్యటన చేపట్టడం తెలంగాణ రాజాకీయాలను ఒక్కసారిగా అగ్గి రాజేసినట్లయింది.

KA Paul Viral Comments on Rahul Gandhi

వరంగల్ లో రైతులను ఉద్దేశించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ అనేక హామీలు.. పార్టీ డిక్లరేషన్ ఇవ్వటం సంచలనంగా మారింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ లపై.. కేఏ పాల్ వైరల్ గా రియాక్ట్ అయ్యారు. దేశాన్ని భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ పార్టీ అని ద్వజమెత్తారు. రాహుల్ ప్రకటించిన హామీలు వింటుంటే నవ్వు వస్తుందని ఎటకారం చేశారు. రాహుల్ ఇచ్చిన వాగ్దానాలు ప్రజలు విశ్వసింఛారని, ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో.. అమలు చేయటం లేదు కాబట్టి.. రాహుల్ హామీలు ఎవరు పట్టించుకోరు అని అన్నారు.

ఈనాడు రైతుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ 70 ఏళ్ల కాలంలో ఏనాడైనా పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చిందా..? రైతులను పట్టించకుందా అని ప్రశ్నించారు. గతంలో దేశాన్ని.. ప్రజలను కాంగ్రెస్ మోసం చేయడంతో ప్రస్తుతం తగిన శిక్ష అనుభవిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి రాహుల్ గాంధీ కల్లబొల్లి హామీలు ఇస్తున్నారు అంటూ కెఏ పాల్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.


Share

Related posts

100 కోట్ల‌కు ఆ ఎమ్మెల్యేను కొన్న జ‌గ‌న్‌… ఇదేంద‌య్యా ఇది?

sridhar

కొడాలి నాని ఏకు మేకు అవుతున్నాడా?

sridhar

జగన్ ప్రభుత్వ చర్యలపై బాబు విసుర్లు

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar