శభాష్ జగన్ అంటున్న కమల్ హాసన్..!!

ఇటీవల మరణించిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీ కి లెటర్ రాశారు. ఇప్పటికే అనేకమంది ఈ డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ తో సహా అశేష సంగీత అభిమానులు అందరూ కూడా భారతరత్న ఇవ్వాలని ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. దీంతో జగన్ మోడీ కి రాసిన లేఖలో కూడా ఇదే విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పలు రకాలుగా డిమాండ్లు వస్తున్నాయి.

Kamal Haasan thanks AP CM YS Jagan for this reason..సంగీత అభిమానుల నుండి మాత్రమే కాక మ్యూజిక్ డైరెక్టర్ల నుండి సింగర్స్ నుంచి అన్ని వైపుల నుండి భారతరత్న ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంకి ఇవ్వాలని డిమాండ్ వినబడుతుంది. ఇలాంటి తరుణంలో వైయస్ జగన్ స్పందించడం పట్ల శభాష్ అన్నట్టు కమలహాసన్ థియేటర్లో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన ట్విటర్లో ప్రధాని మోడీకి జగన్ రాసిన లేఖను పోస్ట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఇలాంటి తరుణంలో ముందడుగు వేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అంటూ కమలహాసన్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మోడీకి రాసిన లెటర్ లో వైయస్ జగన్ గతంలో సంగీత దిగ్గజాలు లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బలక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీంసేన్ జోషి వంటివారికి సైతం భారతరత్న ఇచ్చిన విషయం ప్రస్తావించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం తమ రాష్ట్రంలో జన్మించడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టమని సీఎం జగన్ కొనియాడారు.