కన్నా ని పొమ్మనలేక పొగపెడుతున్నారా?

భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నికైన తర్వాత పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తారని అనుకున్నారు కానీ ఆయన అటువంటి స్టెప్ తీసుకోలేదు. పార్టీ మారే ఆలోచనలో కూడా ఆయన లేరని అనుచరులు చెబుతున్నారు.

 

అయితే ఎపీ బిజెపిలో మాత్రం ఆయన రాజీనామా ప్రచారం గురించి ప్రస్తావన ఆగడం లేదు. అసలు పొలిటికల్ సర్కిల్స్ లో ఈ తరహా ప్రచారం ఎవరు చేస్తున్నారు అనే విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ బిజెపి అధ్యక్షుడిగా వైదొలగిన ఈ రోజు నుండి పార్టీలో ఈ రకమైన ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా లక్ష్మీనారాయణ ఢిల్లీ వెళ్లి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతో సమావేశమయ్యారు. అంతే…. ఆయన అలా వెళ్లాడో లేదో ఇక్కడ రాజీనామాపై డిస్కషన్ మొదలైంది.

ఇది ఎంతలా సాగిందంటే కన్న సొంత అనుచరులు సైతం సైతం ఒక్కసారిగా కన్ఫ్యూజన్ కు గురి అయి ఈ విషయంపై ఆరా తీశారని సమాచారం. పార్టీలో లక్ష్మీనారాయణ అంటే గిట్టని వారు చాలా మంది ఉన్నారని…. వారందరూ కలిసి ఇలా మైండ్ గేమ్స్ ఆడుతున్నారని కొత్త అనుమానాలు వచ్చాయి. అయితే కన్నా లక్ష్మీనారాయణ టిడిపి పార్టీకి కొంచెం అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో అతనిని తప్పించి సోము వీర్రాజు పార్టీ బాధ్యతలు ఇచ్చారని అంటున్నా.రు అదే నిజం అని కూడా ఎంతో మంది భావిస్తుంటారు.

అయితే లక్ష్మీనారాయణ ఎటువంటి మనస్థాపానికి గురి కాకుండా రాజీనామా లాంటి ఆలోచన కూడా లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్నప్పటికీ పార్టీలో కొన్ని శ్రేణుల్లో అతని పై అసంతృప్తి ఉందట. కాబట్టి వారంతా కలిసి ఏదో చిచ్చు రగిల్చేందుకు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు.