NewsOrbit
రాజ‌కీయాలు

AAP: ఆ రాష్ట్రాన్ని టార్గెట్ గా పెట్టుకున్నా కేజ్రీవాల్..!!

AAP: 2012లో ఆమ్ ఆద్మీ పార్టీనీ అరవింద్ కేజ్రీవాల్ స్థాపించారు. అప్పట్లో దేశంలో యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో .. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే దీక్షకు దిగిన సమయంలో కేజ్రీవాల్ పాల్గొని కీలకంగా రాణించి..పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని ప్రకటించారు. ఇది సామాన్యుల పార్టీ అని… 2015 టైంలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి తిరుగులేని విజయాన్ని సాధించారు. అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి బీజేపీ తీవ్ర స్థాయిలో కష్టపడింది. 2014 ఎన్నికల సమయంలో తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో అధికారంలో బీజేపీ అప్పుడే రావడంతో …ఢిల్లీలో కూడా ప్రభుత్వాన్ని స్థాపించాలని ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి అనేక శక్తులు ఒడిగట్టింది. కానీ చివరాఖరికి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో 70 స్థానాలకి  67 స్థానాలు గెలిచి బీజేపీ నీ చిత్తు చిత్తుగా ఓడించి.. ఫస్ట్ టైం ప్రభుత్వాన్ని స్థాపించి.. ప్రజల మన్ననలు పొందింది. Delhi election: Arvind Kejriwal's 'suitable secularism' trumped secularism of oldదీంతో ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ ఢిల్లీలో అద్భుతమైన పరిపాలన అందించడం మాత్రమే కాదు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో నువ్వానేనా అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా మళ్ళీ కలవడం జరిగింది. ఇదిలా ఉంటే కేవలం ఢిల్లీకి పరిమితం చేయకుండా ఆమ్ ఆద్మీ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే దిశగా కేజ్రీవాల్ సరికొత్త రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా.. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో.. పంజాబ్ రాష్ట్రంలో పార్టీని కీలకంగా తీసుకొచ్చి ఎన్నికలలో గెలవడం మనం చూశాం. Not Modi's rise, not Rahul's fall. Arvind Kejriwal is this decade's biggest political storyదాదాపు 92 స్థానాల్లో గెలిచి పంజాబులో మొదటిసారి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. ఇదిలా ఉంటే నెక్స్ట్.. కర్ణాటక లో పోటీ చేస్తున్నట్లు కేజ్రీవాల్ తాజాగా స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తామని ఎవరితోనూ పొత్తు లేకుండా నేను ఒంటరిగా పోటీ చేస్తామని… కచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్నిస్థాపిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశంలో చాలా వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంక్… ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మల్లుతున్నట్లు వార్తలు బలంగా వినపడుతున్నాయి. ఏది ఏమైనా దేశ రాజకీయాలలో ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రయాణం చూస్తుంటే 2024 సార్వత్రిక ఎన్నికలలో.. కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది అని జాతీయ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటె ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో బెంగళూరులో కొన్ని సమావేశాలు నిర్వహించడం జరిగింది. కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. మంచి విద్యా, వైద్యం మరియు విద్యుత్.. మంచి పాలన అందించనున్నట్లు క్యాడర్ కి కేజ్రీవాల్ తెలియజేయడం జరిగింది. ఇక నుండి కర్ణాటక రాష్ట్రంలో కీలకంగా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు.. నెక్స్ట్ టార్గెట్ కర్ణాటక అని కేజ్రీవాల్ తెలిపారు.

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju