NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Karnool : కోటలో జగన్ పాగా!

Karnool : ఒకటి తర్వాత ఒకటి నిండా తలనొప్పులతో సతమతమవుతున్న భూమా కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ చిన్న గ్యాప్ ఇవ్వకుండా చక్రబంధంలోకి నెట్టేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ బోయినపల్లి కిడ్నాప్ కేసులో జైలులో ఉండి వచ్చిన భూమా అఖిలప్రియ బయటకు రాగానే వారి కుటుంబానికి ఎప్పటినుంచో అండగా ఉన్న కర్నూలు విజయ డైరీ చైర్మన్ గిరి పోస్ట్ మీద జగన్ ఇప్పుడు కన్నేశారు. దానిని సాధించారు. ఖచ్చితంగా ఈ సారి విజయ డైరీ పాలక మండలి చైర్మన్ గెలవాలని అనుకున్న జగన్ ఓ వ్యూహం ప్రకారం భూమా కుటుంబానికి చెక్ పెట్టరు. సీఎం ఆదేశం తో కర్నూలు జిల్లా వైసీపీ నేతలంతా ఉమ్మడిగా నాయకత్వ సమాలోచనలు చేసి భూమా కుటుంబానికి చైర్మన్ గిరి దక్కకుండా చేశారు. విజయ డైరీ చైర్మన్ పదవి, డైరెక్టర్ ల పదవులు వైఎస్ఆర్ సిపి నేతలు గెలుపొందారు.

Karnool : in fort jagan revenge!!!
Karnool in fort jagan revenge

25 ఏళ్లుగా భూమా కుటుంబానిదే.. Viajaya dairy

కర్నూలు జిల్లా నంద్యాల కేంద్రంగా కొనసాగుతున్న కర్నూలు విజయ డైరీ పై ఆధిపత్యం 25 ఏళ్ల నుంచి భూమా కుటుంబానిదే. అవడానికి ప్రభుత్వ డైరీ అయినప్పటికీ దీనికి ఎలాంటి ఎన్నికలు లేకుండా భూమా నాగిరెడ్డి బాబాయ్ భూమా నారాయణ రెడ్డి దీనికి ఏకగ్రీవంగా చైర్మన్గా 25 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్నారు. ఎలాంటి ఎన్నికలు ఎలాంటి పోటీ లేకుండానే ఆయన ప్రతి సారి విజయం సాధిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మళ్లీ కర్నూలు నంద్యాల విజయ డైరీ కు ఎన్నికలు ముంచుకు వచ్చాయి. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా ఫ్యామిలీ రాజకీయ విషయాలన్నీ అఖిలప్రియ ముందుండి చూస్తున్నారు. మొదట వైఎస్ఆర్సిపి లో ఉన్న భూమా ఫ్యామిలీ తర్వాత టిడిపి లోకి వెళ్ళింది. అఖిల ప్రియ మంత్రిగా కూడా చంద్రబాబునాయుడు హయాంలో పని చేశారు. దీంతో ఇప్పుడు రాజకీయంగా వైఎస్ఆర్సిపి కు భూమా ఫ్యామిలీ కు మధ్య వైరుధ్యం ఏర్పడింది. దీన్ని ఎలాగైనా సాధించి తమ ఆధిపత్యం కర్నూలు జిల్లాలో సాధించాలని వైఎస్ఆర్ సీపీ నేతలు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ భావించారు. దీంతో కర్నూలు జిల్లా నేతలకు ఆయన స్వయంగా ఫోన్ చేసి ఈ సారి ఖచ్చితంగా చైర్మన్ పదవి వై ఎస్ ఆర్ సి పికు దక్కేలా చూడాలని కోరడంతో ఇప్పుడు ఎన్నడూ లేనట్లుగా విజయ డైరీ పాలకవర్గం ఎన్నికల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. చివరకు 81 ఓట్ల పాలకవర్గం లో అన్నీ డైరెక్టర్ పదవులు వైస్సార్సీపీ నాయకులే పొందారు.

Karnool : జగన్ మోహన్ రెడ్డీ పోటీ!

విజయ డైరీ చైర్మన్ పదవి కోసం వైఎస్సార్సీపీ తరఫున అఖిలప్రియ మేనమామ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేశారు. ఇప్పటివరకు చైర్మన్గా ఉన్న నారాయణరెడ్డి వృద్ధాప్యం కారణంగా డైరీ కార్యకలాపాలు కనీసం పట్టించుకోవడంలేదని సంతకం పెట్టమని చోట్ల పెడుతూ భూమా కుటుంబ అవినీతిలో భాగం అవుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రధాన ఎజెండాగా భూమా ఫ్యామిలీ విజయ డైరీ విషయంలో భారీ అవినీతికి పాల్పడిందని వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రచారం లో జోరుగా ప్రచారం చేశారు. దీంతోపాటు ఈసారి డైరెక్టర్లు కూడా కొత్తవారు వస్తే డైరీ తీరుతెన్నులు బాగు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ కూడా డైరీ మెరుగుదలకు బలంగా ఉన్నారని ప్రచారం చేయడం కలిసి వచ్చింది. దీంతో ఎన్నడూ లేనట్లుగా కర్నూలు జిల్లా నంద్యాలలో డైరీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉత్కంఠ వాతావరణంలో జరిగాయి. మరి దీనిని భూమా అఖిలప్రియ దీన్ని ఎదుర్కొవడంలో తడ బడ్డారు. తమ పెద్దల నుంచి ఎప్పటి నుంచో వస్తున్న చైర్మన్ గిరిని వైఎస్ఆర్సిపి కి వదిలేసారు.. అయితే ఇది కర్నూలు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకు రాబోతోంది? జిల్లా రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? భూమా కుటుంబం ఆధిపత్యానికి ఇక్కడినుంచే గండి పడనుందా అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది.

author avatar
Comrade CHE

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju