కే‌సి‌ఆర్ – జగన్ తరఫున యుద్ధరంగం లోకి దిగి దెబ్బలాడుకుంటున్న .. ఏపీ – టీజీ మినిస్టర్ లు…!!

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల మధ్య జల వివాదం చాలా గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల కేంద్రం రైతులకు ఉచిత విద్యుత్ ఈ విషయంలో బోర్లకు మీటర్లు అమర్చే విధానంపై ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మినిస్టర్లు నువ్వా నేనా అన్నట్టుగా కామెంట్లు చేసుకుంటున్నారు. ఇటీవల దుబ్బాక లో జరగబోయే ఎన్నికల ప్రస్తావన సందర్భంలో  ఆ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రం ఇటీవల నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక మంత్రుల భేటీ సమావేశంలో 2500 కోట్లు ఇస్తామనీ తెలంగాణ రైతుల బోర్లకు మీటర్లు బిగించాలని తెలిపింది కానీ కేసీఆర్ సర్కార్ ససేమిరా అని తెలిపినట్లు హరీష్ పేర్కొన్నారు.

Balineni Srinivasa Reddy: నిధులు మా జేబులో వేసుకోము.. TRS ప్రభుత్వానికి ఏపీ మంత్రి చురకలు | ఏపీ News in Teluguకానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం దీనికి ఓకే చేశారని…. మీటర్ల పేరుతో ఆంధ్ర రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నరని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి విద్యుత్ బొర్లకు అధికారులకు మీటర్లు అమర్చే విషయంలో కేంద్రంతో సఖ్యతగా ఉండటం కోసమే కష్టాల్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్రానికి మద్దతు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అదే విధంగా కేంద్రం ఇచ్చే నాలుగు వేల కోట్లు జోబులో వేసుకోవడానికి కాదు ప్రజలకు ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఒకరోజు ఒకలా మరొరోజు మరొకలా కేంద్రంతో గొడవపడటం రాష్ట్ర అభివృద్ధికి అంత మంచిది కాదని కాబట్టి కేంద్రంతో సఖ్యతగా మెలగడం అవసరమని పేర్కొన్నారు. ఇక రైతులకు అందించే ఉచిత విద్యుత్ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మరో 30 సంవత్సరాలపాటు రైతులకు ఉచిత విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా డిస్కంలకు చెల్లించవలసిన బిల్లు కూడా నేరుగా రైతుల ఎకౌంటులో ముందుగానే డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఏది ఏమైనా కేసీఆర్ జగన్ తరఫున ఇద్దరు మినిస్టర్లు రైతుల విద్యుత్ విషయం లో యుద్ద రంగంలోకి దిగినట్లు దెబ్బలాడుకుంటూన్నట్లు ఒక ప్రభుత్వం పై మరొకరు విమర్శలు చేసుకున్నారు అనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది.