తెలంగాణ‌ రాజ‌కీయాలు

PK KCR Meet: కేసీఆర్ – పీకే అదే పాయింట్ పై..!?

Share

PK KCR Meet:  పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయనున్నా సంగతి తెలిసిందే.. ఈ మేరకు మూడు రోజుల కిందట ప్రణాళిక కూడా చర్చించారు. పొత్తులపై పీపీలో స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలంగాణాలో టీఆరెస్ పార్టీ తరపున పీకే సంస్థ ఐప్యాక్ పని చేస్తుందని తెలిపారు. అందుకే ఈరోజు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ దాదాపు రెండు గంటల పాటూ భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన తర్వాత ఇద్దరూ కలిసి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్టు సమాచారం.ఈ రాత్రికి మరింత లోతుగా చర్చించిన అనంతరం పీకే ఢిల్లీ వెళ్లనున్నారు. ఇంతకు పీకే – కేసీఆర్ ఏం చర్చించారు.. ఏం మాట్లాడి ఉంటారు..? అనే సందేహాలకు ఇవే సమాధానాలు..!

PK KCR Meet: పొత్తులు.. సర్వేలు.. స్ట్రాటెజీలు..!

గత మూడు రోజుల నుండి దేశ, రాష్ట్ర రాజకీయాలపై పీకే టీం స్పెషల్ వర్క్ చేసింది. కాంగ్రెస్ కు పలు జాతీయ అంశాలపై వివరించిన సందర్భంలోనే తెలంగాణాలో సింగిల్ గా వెళ్లాలని సూచించారు. కానీ ఇక్కడ తెలంగాణాలో టీఆరెస్ కి పీకే స్ట్రాటజిస్ట్ గా పని చేస్తూ.. అక్కడ కాంగ్రెస్ కు తెలంగాణాలో సింగిల్ గా వెళ్ళమని చెప్పారంటే దానిలో ఒక ప్లాన్ ఉండి ఉంటుంది. ఆ ప్రణాళిక వివరించడానికి నేడు కేసీఆర్ – పీకే భేటీ అయినట్టు తెలుస్తుంది. ఇదే అంశంపై చాలా సమయం పాటూ కేసీఆర్‌తో పీకే చర్చలు జరిపారు. ప్రశాంత్ కిషోర్ టీమ్ తెలంగాణలో సర్వేలు చేస్తోంది. ఈ ఫలితాలపై కూడా కేసీఆర్, పీకే మధ్య వరుస సమావేశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చమొదలైంది. ఇప్పటికే రాజకీయ, పాలన పరిస్థితులపై పీకే టీమ్‌ సర్వేనిర్వహిస్తోంది..!


Share

Related posts

కే‌సి‌ఆర్ ప్రవర్తన పై తీవ్ర విమర్శలు..

Yandamuri

Telugu Politics: ఇక పాదయాత్రలు షురూ.. షర్మిల – రేవంత్ రెడ్డి – పవన్ – లోకేష్..! ముహూర్తం ఫిక్స్..!?

Srinivas Manem

జగన్ విమానం ఎక్కితే చాలు బిత్తరపోతున్న టిడిపి..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar