దుబ్బాక ఉప ఎన్నిక పై ఫస్ట్ టైం స్పందించిన కేసీఆర్..!!

తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా ప్రధాన పార్టీలు తీసుకున్నాయి. ఎలాగైనా అధికార పార్టీని ఓడించాలని విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుని ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఉందని రుజువు చేయడానికి ఆరాట పడుతున్నాయి. ఈ క్రమంలో బిజెపి పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే రీతిలో దూసుకుపోతుంది. పరిస్థితి ఇలా ఉండగా దుబ్బాక ఉప ఎన్నిక గురించి ఫస్ట్ టైం స్పందించారు. జరగబోయే ఉప ఎన్నికలో  గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ కేసీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు.

Telangana government credits Rs 1,500 each to over 74 lakh bank accounts | The News Minuteదుబ్బాక ఉపఎన్నిక గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయిందని పేర్కొన్నారు. మంచి మెజారిటీతో జరగబోయే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అప్పటి వరకు అన్ని తతంగాలూ నడుస్తుంటాయి పట్టించుకోనవసరం లేదని తెలిపారు. మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. గ్రౌండ్ రిపోర్ట్ లు చాలా క్లియర్ గా ఉన్నాయని, కచ్చితంగా దుబ్బాకలో గెలవటం గ్యారెంటీ అని కేసిఆర్ స్పష్టం చేశారు. 

ఇటీవల ధరణి పోర్టల్ ప్రారంభం తర్వాత మీడియాతో చిట్ చాట్ చేసిన క్రమంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పటివరకు దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో కేసిఆర్ ఏమి పాల్గొనకుండా ఆ జిల్లాకు చెందిన మంత్రి హరీష్ రావు తో ప్రచారం చేపిస్తున్నారు. అదే విధంగా మిగతా మంత్రులు కూడా ఎవరు అక్కడ కి ప్రచారానికి వెళ్లలేదు పూర్తి నమ్మకం మీద కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.