NewsOrbit
రాజ‌కీయాలు

Modi Kejriwal: పక్క ప్లానింగ్ తో మోడీ కంచుకోట బద్దలు కొట్టబోతున్న కేజ్రీవాల్..!!

Modi Kejriwal: మనకందరికీ తెలుసు గుజరాత్ రాష్ట్రం నుండి మూడుసార్లు ముఖ్యమంత్రిగా మోడీ ఎన్నికయ్యారు అని. ఇదే సమయంలో దేశ ప్రధానిగా ఉన్న గాని మోడీ గుజరాత్ విషయంలో ప్రత్యేకమైన అభిమానం కొన్ని పెట్టుబడులు ఇంకా నిధుల కేటాయింపు విషయంలో చూపిస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చెబుతూ ఉంటారు. గుజరాత్ మోడీ కంచుకోట అని అంటారు. అటువంటి మోడీ కంచుకోట గుజరాత్ రాష్ట్రాన్ని ఇప్పుడు కేజ్రీవాల్ టార్గెట్ చేయడం జరిగింది. గత ఏడు సంవత్సరాల నుండి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ దేశ రాజకీయాలలోనే సంచలనం సృష్టిస్తున్నారు. ఎటువంటి డబ్బు.. మద్యం పంచకుండా అధికారంలోకి వస్తే చేసేదే చెబుతూ.. దేశంలో గత ఏడు సంవత్సరాల నుండి క్లియర్ కట్ పాలిటిక్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. సామాన్యుడి పార్టీ అని ప్రజల్లోకి ఆమ్ ఆద్మీ పార్టీని బలంగా తీసుకెళ్లి.. దేశ రాజధాని ఢిల్లీలో రెండుసార్లు అధికారం కైవసం చేసుకున్నారు. అనంతరం పార్టీని దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తూ ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పంజాబ్ రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు.

Kejriwal is going to break gujarat bjp

ఈ దిశగా ఒక్కొక్క రాష్ట్రంలో చాలా తెలివిగా ఎంట్రీ ఇస్తున్న కేజ్రీవాల్ ఈ సారి ఏకంగా.. మోడీ అడ్డా గుజరాత్ రాష్ట్రాన్ని టార్గెట్ గా పెట్టుకోవడం జరిగిందట. అంతమాత్రమే కాదు గుజరాత్ రాష్ట్రంలో గెలుపుపై కేజ్రీవాల్ చాలా ధీమాగా కూడా ఉన్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ పాలనపై విమర్శలు చేస్తూ… దాదాపు ఆరు లక్షల మంది నిరుద్యోగులు.. బీజేపీ పాలన వల్ల మోసపోయారు. గుజరాత్ రాష్ట్రం చూడటానికి పైకి మేడిపండు లాగా కనిపిస్తున్నప్పటిక.. రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవ్, ఉపాధి లేదు.. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు చేయడం.. మాత్రమే కాదు పూర్తిగా ప్రక్షాళన చేస్తామని గుజరాత్ రాజకీయాన్ని విమర్శలతో ఆల్రెడీ కేజ్రీవాల్ స్టార్ట్ చేయడం తెలిసిందే.

Kejriwal is going to break gujarat bjp

ఓటింగ్ శాతం చూస్తే సింగల్ నెంబర్ డిజిట్

గుజరాత్ రాష్ట్రంలో గత ఆరు ఎన్నికల నుండి బీజేపీ యే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపు మూడు సార్లు మోడీ ఆధ్వర్యంలో బీజేపీ గుజరాత్ లో గెలవడం జరిగింది. అటు ఇటు గా బిజెపి ఎప్పుడూ కూడా వంద స్థానాలు గెలుచుకుంటూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ 70 ఆ తరహాలో స్థానాలు సంపాదిస్తుంది. ఓటింగ్ శాతం చూస్తే బీజేపీకి ప్రతిపక్షాలకు కేవలం సింగల్ నెంబర్ డిజిట్ మాత్రమే తేడా ఉంది. సో దీన్ని బట్టి చూస్తే గుజరాత్ లో ప్రతిపక్షాలకు అధికారం చేపట్టే ఛాన్స్ ఉందని విశ్లేషకులు లెక్కలు చెబుతున్నారు. ఇవే లెక్కలు కేజ్రివాల్ నమ్ముతున్నట్లు.. దీంతో అవసరమైతే గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీతో కలిసి .. లేకపోతే విడివిడిగా పోటీ చేసి ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎలాగైనా మోడీ అడ్డా గుజరాత్ లో బీజేపీని గద్దె దించే దిశగా కేజ్రీవాల్ పక్క ప్లానింగ్ తో ఉన్నారట. గుజరాత్ లో బిజెపిని ఓడిస్తే.. మిగతా చోట్ల కూడా ఓడించినట్లే అనేది కేజ్రీవాల్ భావన. ఇందుకోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు కూడా తీసుకుంటున్నట్లు విశ్లేషకులు వివరిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీనీ ఎలాగైనా గద్దె దించాలని.. బిగ్ టార్గెట్ గా కేజ్రీవాల్ ఇప్పుడు పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!