రాజ‌కీయాలు

Nani & Vamsi: రాధా ఎపిసోడ్ లో నాని, వంశీలకు నిరాశేనా..? భువనేశ్వరి ఎఫెక్టేనా..?

kodali nani and vamsi for radha
Share

Nani & Vamsi: ఎప్పుడూ వాడిగా ఉండే ఏపీ రాజకీయాలు ఇప్పుడు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయాలు మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇందుకు కారణం.. ఇటివల మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, టీడీపీ నేత వంగవీటి రాధా ఎపిసోడ్ కారణం. రంగా వర్ధంతి సందర్భంలో తన హత్యకు రెక్కీ జరిగిందన్న రాధా వ్యాఖ్యలతో వాతావరణం వేడెక్కింది. ఇదే సమయంలో టీడీపీలో ఉన్న రాధాను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు నాని, వంశీ చేసిన ప్రయత్నాలు దాదాపు బెడిసికొట్టాయి. ప్రభుత్వం కల్పించిన భద్రతను కాదని.. చంద్రబాబుతో సహా, వరుసగా టీడీపీ నేతలతో రాధా భేటీ అయ్యారు.

kodali nani and vamsi for radha
kodali nani and vamsi for radha

Nani & Vamsi:  రాధా కోసం నాని, వంశీ ప్రయత్నాలు..

అయితే.. రాధాను వైసీపీలోకి తీసుకురావడానికి వారిద్దరూ తమ వంతు ప్రయత్నాలు గట్టిగానే చేశారు. తమది మిత్రబంధమని చెప్పారు. రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణలకు కలిసే వెళ్లారు. కాన.. రాధా తీరు వారికి షాకిచ్చేదనే చెప్పాలి. ముఖ్యంగా రాధాను వైసీపీలోకి తీసుకురావడం.. నాని, వంశీలకు వ్యక్తిగతంగా ప్రాధామ్యంగా మారిందని చెప్పాలి. కృష్ణా జిల్లా సామాజికవర్గాల పరంగా కమ్మ, కాపు వర్గాలు ఎక్కువగానే ఉంటాయి. పక్కపక్కనే ఉన్న గుడివాడ, గన్నవరంలో నాని, వంశీ గెలుపుకు కాపు ఓట్లు కూడా కీలకం అయ్యాయని అంటారు. అటువంటి వారికి ఇప్పుడు కాపు ఓట్లను దరి చేర్చుకోవడం తప్పని సరైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటివల వార్తల్లో నిలిచిన చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అంశం ఇందుకు కారణమైందని తెలుస్తోంది.

వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికేనా..?

స్వతహాగా కమ్మ సామాజికవర్గం వంశీ, నానికి అండగానే ఉంటారు. అయితే.. భువనేశ్వరి అంశం వీరికి సొంత సామాజికవర్గంలోనే ఎదురు గాలి వీచే పరిస్థితులు ఉన్నాయనే వార్తలు లేకపోలేదు. పైగా.. వారి సామాజికవర్గ బలమంతా టీడీపీకి వెళ్లకూడదు.. కాపుల ఓట్లను దూరం చేసుకోకూడదంటే.. రాధాను వైసీపీలోకి తీసుకొస్తే తమకు వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు దూరం కావనేది ఓ ఆలోచనగా తెలుస్తోంది. అయితే.. రాధా ఇచ్చిన షాక్, టీడీపీ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకున్న విధానం ఇప్పుడు వీరిద్దరికీ షాక్ ఇచ్చిందని అంటున్నారు. మరి.. మున్ముందు స్నేహితులైన ఈ ముగ్గురూ ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.


Share

Related posts

MPTC,ZPTC Elections : ఏపిలో కొనసాగుతున్న పరిషత్ పోలింగ్

somaraju sharma

‘ఇదీ బాబు బ్రీఫింగేనా?’

somaraju sharma

‘మోదీ ఆ పని చేస్తే బిజెపిలోకి ఖాయం’

somaraju sharma