NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Kodali Nani Pavan Kalyan: కొడాలి నానికి అండగా పవన్ కళ్యాణ్..! టీడీపీలో మళ్ళీ వణుకు..!?

Kodali Nani Pavan Kalyan: JSP Full Supporting Kodali Nani.. TDP Fears

Kodali Nani Pavan Kalyan: కొడాలి నాని గురించి అందరికీ తెలుసు.. టీడీపీని వణికిస్తున్న పేరు.. వైసీపీలో ఓ బ్రాండ్.. అతను చేసేవి చాలా వరకు వైసీపీ వాళ్లకు కూడా నచ్చకపోయినప్పటికీ.. టీడీపీకి బద్ధ వ్యతిరేకి,, చంద్రబాబు, నారా లోకేష్ తో బాగా ఆడుకుంటారు.. అనే కారణంతో వైసీపీలో కొందరు అతన్ని భరిస్తున్నారు.. ఇక ఈ కొడాలి నానిపై టీడీపీ కూడా ఫోకస్ పెట్టింది. అతన్ని ఎలాగైనా ఓడించాలని కసిగా ఉంది. 2019లోనే ఆ ప్రయత్నం చేసినప్పటికీ.. ఫలించలేదు. దేవినేని అవినాష్ ని దింపి, సర్వ అస్త్రాలు ఇచ్చినప్పటికీ ఫలించలేదు. అందుకే 2024 లో మాత్రం ఏదోటి చేసి కొడాలి నానిని ఓడించాలని టీడీపీ ఫోకస్ పెడుతుంది.. అటు నాని కూడా 2024లో అసలు టీడీపీ అనే పార్టీ ఉండకూడదని.. చంద్రబాబు, లోకేష్ లు పార్టీని వదిలి పారిపోవాలి అనేంత కసిగా మారిపోయారు.. ఇవన్నీ పక్కన పెడితే ఈ సారి లెక్కల్లో టీడీపీ ఒక ఆసక్తికర అంశాన్ని బయటకు తీస్తుంది. 2019లో కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే కొడాలి నాని గెలిచాడని.. ఈ సారి మాత్రం ఆ తప్పు జరగకుండా చూడాలని జనసేనని కూడా ప్రేరేపిస్తుంది..! ఇంతకూ 2019లో ఏమైందంటే..

Kodali Nani Pavan Kalyan: JSP Full Supporting Kodali Nani.. TDP Fears
Kodali Nani Pavan Kalyan JSP Full Supporting Kodali Nani TDP Fears

Kodali Nani Pavan Kalyan: జనసేన నానికి పని చేసిందట..!!

గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ పరోక్షంగా కొడాలి నానికి సహకరించింది అనేది టీడీపీకి వచ్చిన అంతర్గత సమాచారం. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు, ఓట్ల లెక్కలూ ఉన్నాయి. గుడివాడలో 2019 ఎన్నికల్లో ఓట్ల వివరాలు పరిశీలిస్తే.. వైసీపీ అభ్యర్ధి కొడాలి నానికి 89,833 ఓట్లు రాగా టీడీపీ.., అభ్యర్ధి దేవినేని అవినాష్ కు 70,354 ఓట్లు వచ్చాయి.. జనసేన పార్టీ ఇక్కడ అసలు పోటీ చేయలేదు. అందుకే వైసీపీ మెజార్టీ 19,479 ఓట్లుతో గెలుపు..! అయితే ఈ గుడివాడ మచిలీపట్టణం పార్లమెంట్ కిందకు వస్తుంది. మచిలీపట్నం పరిధిలో ఉన్న టీడీపీ ఎంపీ అభ్యర్ధికి గుడివాడ నియోజకవర్గంలో 75,790 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్ధికి 75,039 ఓట్లు, జనసేన అభ్యర్ధికి 10,265 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్ధికి వచ్చేసరికి టీడీపీకే 750 ఓట్లు ఎక్కువ వచ్చాయి. దీన్ని బట్టి అర్ధం అవుతుంది కదా. గుడివాడలో బలమైన జనసేన అభ్యర్ధిని పోటీ పెట్టినట్లు అయితే సుమారు 15 వేల పైచిలుకు ఓట్లు వచ్చేవి. తద్వారా టీడీపీ గెలిచేది అనే లెక్కల్లో టీడీపీ ఉంది..!

Kodali Nani Pavan Kalyan: జనసేన వాళ్ళు వైసీపీకి ఎందుకు వేస్తారు..!?

ఇక్కడ మరో అనుమానం రావచ్చు.. జనసేన వాళ్ళు వేస్తే టీడీపీకి వేస్తారు.. లేదా బీజేపీకి వేస్తారు.. కానీ వైసీపీకి ఎందుకు వేస్తారు..!? అనే అనుమానం రావచ్చు. గుడివాడలో అంతే.. అక్కడ ఎక్కువగా కమ్మ సామాజికవర్గ నేతలు ఎన్నిక అవుతున్నప్పటికీ ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గ ఓట్లు ఎక్కువ. దాదాపు 30 వేలు కాపు సామాజికవర్గ ఓట్లు ఉండగా… వాటిలో 70 శాతం కొడాలి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నాయి. కమ్మ సామాజికవర్గ ఓట్లు పది నుండి 13 వేల మధ్య ఉండగా అవి సగం, సగం చీలిపోతాయి..! 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి పోటీకి దించినట్లైయితే వైసీపీ, టీడీపీ మధ్య గట్టిపోటీ ఏర్పడేది. కాపుల ఓట్లు జనసేనకు పడేవి.. టీడీపీ అభ్యర్ధికే గెలుపు అవకాశాలు ఉండేవి. జనసేన పోటీ చేయకపోవడం కొడాలి నానికి కలిసి వచ్చింది అని టీడీపీ అర్ధం చేసుకుంది. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో టీడీపీ, జనసేన పొత్తు ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. పొత్తు లేకపోతే జనసేన పార్టీ అభ్యర్ధిని పోటీ పెడుతుందా..? లేదా అనేది ఆసక్తికరమైన టాపిక్ గా ఉంది.

Kodali Nani Pavan Kalyan: JSP Full Supporting Kodali Nani.. TDP Fears
Kodali Nani Pavan Kalyan JSP Full Supporting Kodali Nani TDP Fears

పవన్ కూడా రూట్ మార్చారు..!

అయితే ఈ లెక్కను పవన్ కళ్యాణ్ కూడా గ్రహించారట.. అందుకే టీడీపీతో పొత్తు లేకపోతే మాత్రం జనసేన నుండి బలమైన అభ్యర్ధిని నిలపాలన్న ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని సమాచారం. గుడివాడలో జనసేన అభ్యర్ధి లేకపోతే వైసీపీకి లాభిస్తుంది అని గతంలో పవన్ కళ్యాణ్ భావించలేదని అంటున్నారు. జనసేన అభ్యర్ధి పోటీలో లేకపోవడం వల్లనే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొడాలి నాని 19వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎంపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు చూసుకుంటే గుడివాడ నియోజకవర్గంలో టీడీపీకే 500లకుపైగా ఓట్ల మెజార్టీ ఉంది. గుడివాడలో ఈ లెక్కలు టీడీపీ, జనసేనను ఆలోచింపజేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.

author avatar
Srinivas Manem

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju