NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కోపం, రౌద్రం, పౌరుషం కొడాలి నాని ఈ రేంజ్ లో ఫైర్ అవటానికి కారణం ఇదేనా…??

తెలుగు రాజకీయాలలో గుడివాడ నియోజకవర్గం అంటే మొదటిగా వినపడే పేరు కొడాలి నాని అని చాలా మంది సీనియర్ నాయకులు అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం లో కొడాలి నాని ఎమ్మెల్యే అవ్వకముందు రావి వెంకటేశ్వరరావు కుటుంబం హవా గట్టిగా ఉండేది. అదేసమయంలో కొడాలి నాని కూడా టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే వారు. ముఖ్యంగా టిడిపి లో కొడాలి నాని హరికృష్ణకు అత్యంత సన్నిహితుడిగా అనుచరుడుగా ఉంటూ వచ్చేవారు. అంతేకాకుండా హరికృష్ణ తనయుడు సినీ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటర్ చదువు కొడాలి నాని ఇంట్లోనే ఉండి అప్పట్లో కంప్లీట్ చేసినట్లు కూడా చాలామంది చెబుతారు.

We shall provide the ration to the poor at the earliest possible, Minister Kodali Nani assertsఅంత సన్నిహితంగా హరికృష్ణ కుటుంబంతో ఉండటంతో గుడివాడ ఎమ్మెల్యే టికెట్ కొడాలి నానికి అప్పట్లో ఇప్పించడం విషయంలో హరికృష్ణ పార్టీలో కీలకంగా వ్యవహరించారని చాలామంది అంటారు. 2009 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన తర్వాత చాలా వరకు పార్టీలో హరికృష్ణ ని జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీ హైకమాండ్ చాలావరకు పక్కన పెట్టడంతో పాటు కొడాలి నాని ని కూడా రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూసినట్లు… అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. అదే సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడం జరిగింది. దీంతో గతంలో వై.ఎస్ తన నియోజకవర్గానికి సంబంధించి అనేక విషయాలలో సహాయం చేయడంతో కొడాలి నాని… జగన్ కి దగ్గరవటం మాత్రమే కాకుండా జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చిన సమయంలో టిడిపి పార్టీకి రాజీనామా చేసిన మొట్టమొదటి ఎమ్మెల్యేగా కొడాలి నాని సంచలనం సృష్టించారు.

 

అటువంటి కొడాలి నాని తనని రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూసిన టిడిపి పార్టీ ని నామరూపాలు లేకుండా చేయాలనే కసితోనే మొదటి నుండి జగన్ కు అత్యంత సన్నిహితంగా కృష్ణాజిల్లాలో రాజకీయాన్ని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా తిప్పటం స్టార్ట్ అయిందట. వాస్తవానికి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం టిడిపి లో ఉన్న కీలక నాయకులు అంతకు ముందు కొడాలి నానికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. కానీ 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ని అదేవిధంగా తనని పొలిటికల్ గా దెబ్బకొట్టాలని టిడిపిలో కొంతమంది నాయకులు చేసిన ప్రయత్నాల్లకి కొడాలి నాని టిడిపి ఆ పార్టీ పెద్దలు అన్న ఒంటికాలిపై కోపం, రౌద్రం, పౌరుషం తరహాలో మీడియా సమావేశాల్లో అయినా అసెంబ్లీ లో అయినా మాట్లాడతారని కృష్ణాజిల్లాలో టాక్.

 

ముఖ్యంగా తనకి రాజకీయంగా లైఫ్ ఇచ్చిన హరికృష్ణ కుటుంబాన్ని టిడిపి పెద్దలు చాలావరకు అవమానించడం తోనే…. కొడాలి నాని ఓ రేంజ్ లో ఫైర్ అవ్వడానికి కారణం… అదే అని చాలామంది సీనియర్ రాజకీయ నేతలు  అంటుంటారు. ఏది ఏమైనా ప్రస్తుతం జగన్ నేతృత్వంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని…టిడిపి పార్టీ ని టార్గెట్ చేసుకుని చేస్తున్న విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. 

 

 

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju