కేటీఆర్‌కు ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఆహ్వానం

హైదరాబాద్ డిసెంబర్ 29: టీఆర్‌ఎస్‌ పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాగానే‌  కె.తారక రామారావుకు గుర్తింపు ఇంకాస్త పెరిగినట్లుంది. మహాకుంభమేలాకు రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్ మంత్రి సతీశ్‌ మహానా శనివారం హైదరాబాద్‌లో కెటిఆర్‌ను  కలిశారు. జనవరి 15  నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం  అలహాబాద్(ప్రయాగరాజ్)లో జరిగే మహా కుంభమేళాకు రావాలని కేటీఆర్‌ను ఆహ్వానించారు. దేశంలో జరిగే నదీ పుష్కరాల్లో అత్యంత ప్రఖ్యాతమైంది మహాకుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. గంగానదికి 12ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం  దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణ నుంచి కేటీఆర్‌ను ఆహ్వానించారు.