NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్..!!

హైదరాబాద్ నగరం అంటే ట్రాఫిక్ సమస్యతో పాటు నీటి సమస్య కూడా గుర్తుకు వస్తది. ఇదిలాఉండగా త్వరలో దాదాపు 30 సంవత్సరాల పాటు హైదరాబాదులో నీటి కొరత ఉండదని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్ జలమండలి పురపాలక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కేశవాపురం ప్రాజెక్టు పనులకు సంబంధించి వివరాలు అధికారుల దగ్గర కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.

BJP Faults KTR having Review Meeting with Officialsఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన సుమారు 1490 ఎకరాల భూ సేకరణ దాదాపు పూర్తి కావచ్చింది అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 2050 వరకు హైదరాబాదులో తాగునీటి అవసరాలకు ఎలాంటి సమస్య ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన పనులు సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించిన అన్ని పనులు వేగంగా పూర్తి చేయాలని, ఈ సందర్భంగా జలమండలి అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

అదేవిధంగా నగరంలో 770 ఏం.ఎల్.డిల మురికి నీటి శుద్ధీకరణ కొనసాగుతుందని ఇది దేశంలో అన్ని నగరాల్లో కన్నా అత్యధికమని కేటీఆర్ తెలిపారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో నీటి కొరత ఉండదని కేటీఆర్ తెలపడంతో హైదరాబాద్ వాసులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరోపక్క కొంతమంది ఎన్నికలప్పుడే కాదు, మామూలు అప్పుడు కూడా పనిచేయాలని ఈ వార్తల పై స్పందిస్తున్నారు. అంతేకాకుండా వర్షం వచ్చిన సమయంలో రోడ్లు జలమయం అవడం వంటి విషయాలపై కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు ఎప్పుడూ ప్రజా సమస్యల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. 

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju