రాజ‌కీయాలు

KTR: తెలంగాణలో షర్మిల రాజకీయాలపై కేటీఆర్ వైరల్ కామెంట్స్..!!

Share

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో YSRTP  పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు షర్మిల ఎవరు ఆమెకు తెలంగాణలో ఏంటి పని అని ప్రశ్నించారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటండీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్న మీద కోపం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టుకోవాలని కానీ తెలంగాణాలో పార్టీ పెడితే ఏం లాభం అని ఎదురు ప్రశ్నించారు.

ys sharmila strong counter to ktr fallowers of retweet on occation of his birthday– News18 Telugu

అసలు షర్మిలకు తెలంగాణకు ఏమైనా సంబంధం ఉందా అని అన్నారు. అన్నయ్య మీద కోపం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ సాధించాలని తెలంగాణలో… పార్టీ ఏర్పాటు చేస్తే ఏం లాభం అని అన్నారు. షర్మిల తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు బద్ధ వ్యతిరేకి.. ఆయన మరణించేదాకా ప్రత్యేక తెలంగాణ ఈ విషయంలో వ్యతిరేకత తెలుపుతూనే వచ్చారు. మరి ఇటువంటి తరుణంలో షర్మిల నేను తెలంగాణ బిడ్డను అంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు అని.. పేర్కొన్నారు.

INTERVIEW | KTR mocks PM's double-engine idea, calls Congress manifesto a 'joke'- The New Indian Express

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా షర్మిల లాంటివాళ్ళు.. మాట్లాడితే కెసిఆర్ పై బూతు పురాణాల వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ… వివక్ష చూపిన కానీ ఇప్పటివరకు ఒక మాట అనలేదని పేర్కొన్నారు. మరి తెలంగాణాలో  ఇటువంటి శిఖండి సంస్థలు ఎవరు పుట్టించారు..? అదేవిధంగా ఇలాంటి వారు ఎవరు ఏజెంట్లు ? అనేది ప్రజలు  ఆలోచించుకోవాలని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 


Share

Related posts

పేద దేశాలను ఆదుకోవడం కోసం కేంద్రం కీలక నిర్ణయం..!!

sekhar

‘చంద్రం సారుకు నిద్రపట్టదు’

somaraju sharma

‘జగన్ ‘ఫ్యాన్’ స్విచ్ హైదరాబాద్‌లో.. ఫ్యూజ్ ఢిల్లీలో..!’

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar