రాజ‌కీయాలు

KTR YS Jagan: ఏపీ పై నెగిటివ్ కామెంట్లు చేసిన తర్వాత జగన్ ని పొగుడుతూ కేటీఆర్ వైరల్ పోస్ట్..!!

Share

KTR YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు గట్టిగానే కౌంటర్ లు ఇస్తున్నారు. ఏపీలో రోడ్లు, కరెంటు, నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి.. అధ్వానం. ఈ విషయం గురుంచి తన ఏపీకి చెందిన మిత్రుడు తెలియజేసినట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. మళ్ళీ మా ఊరు నుండి హైదరాబాద్ వచ్చాక ఊపిరిపీల్చుకున్న మని.

KTR viral post praising Jagan after making negative comments on AP

ఈ క్రమంలో ఇక్కడ పాలకుల విలువ ప్రజలకు తెలియాలంటే… నాలుగు బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రజలను ఏపీకి తరింలించాలి అప్పుడు తెలుస్తది.. అని మిత్రుడు చెప్పినట్లు  తెలిపారు. అంత దారుణంగా ఏపీలో మౌలిక సదుపాయాలు ఉన్నాయి అని కేటీఆర్ ఓ సమావేశంలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో వైసీపీ మంత్రులు మరి కొంతమంది నాయకులు.. ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇక ఇదే సమయంలో కేటీఆర్ వ్యాఖ్యలను ఏపీలో ప్రత్యర్థి పార్టీల నేతలు ఆధారం చేసుకుని…వైసీపీ ప్రభుత్వం పై భారీగా సెటైర్లు వేయడం జరిగింది. 

KTR viral post praising Jagan after making negative comments on AP

దీంతో పొలిటికల్ గా వివాదం ఉన్న కొద్ది పెరుగుతూ ఉండటంతో వ్యవహారం మొత్తం అదుపుతప్పి ఎలా కనిపిస్తూ ఉండటంతో ఏపీలో మౌలికవసతుల పై చేసిన నెగిటివ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కేటీఆర్ వివరణ ఇచ్చారు. అనుకోకుండా ఒక మీటింగ్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా స్నేహితులకు బాధ కలిగించి ఉండవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో నాకు గొప్ప సోదరభావం అనుబంధం ఉంది. వైయస్ జగన్ పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని.. ఆకాంక్షిస్తున్నాను అని.. కేటీఆర్ పోస్ట్ పెట్టారు. దీంతో ఇప్పుడు కేటీఆర్ రెండోసారి చాలా కూల్ గా.. రియాక్ట్ కావడంతో… ఈ వివాదం కాస్త సద్దుమణిగే పరిస్థితికి చేరుకుంటుంది. కేటీఆర్ వివరణ ఇచ్చి జగన్ ని పొగుడుతూ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Share

Related posts

సైలెంట్ రాజకీయం చేస్తున్న ఆ ఇద్దరు టీడీపీ నేతలు..!!

sekhar

రాజకీయ నాయకులు కూడా ముందుకు రావాలి అంటున్న పవన్..!!

sekhar

AP High Court : హైకోర్టులో ఎస్ఈసీకి మరో సారి షాక్ … మంత్రి కొడాలి నానికి ఊరట

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar