రాజకీయాలకు దూరంగానే ఉంటా

విజయవాడ : వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. టిడిపి తరఫున తాను నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాని జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని లగడపాటి వెల్లడించారు.

విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాలకు వ్యతిరేకం కాదనీ, కానీ ప్రత్యక్ష రాజకీయాలకూ దూరంగా ఉన్నాననీ రాజగోపాల్ అన్నారు. అన్ని పార్టీల నేతలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని లగడపాటి తెలిపారు.

ఏప్రిల్ 11 న తన సర్వే వివరాలు ప్రకటిస్తానని చెప్పిన లగడపాటి.. ఇప్పటికే సర్వే ప్రక్రియ ప్రారంభించానని అన్నారు.

ప్రత్యేక హోదా అంశం ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని లగడపాటి అన్నారు. అలాగే జాతీయ ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ లాంటి సెంటిమెంట్లు ప్రభావం చూపే అవకాశం ఉందని లగడపాటి చెప్పారు.

ఏపీలో టిడిపి, వైసిపి, జనసేనల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని లగడపాటి అన్నారు.