NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Laxmi Aparna: లక్ష్మీ అపర్ణకు అండగా మహిళా సంఘాలు..! సమస్య జటిలమవుతోందా..?

lakshmi aparna issue

Laxmi Aparna:  లక్ష్మీ అపర్ణ Laxmi Aparna పై విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్రంలో వివాదాస్పదం అవుతోంది. ఆమె ఆరోజు అవసరమైన పత్రాలు తీసుకురాలేదని.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందని పోలీసులు అంటున్నారు. పోలీసుల ప్రవర్తనే తప్పని ఆమె ఆరోపిస్తోంది. మొత్తంగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. మహిళా పోలీసులు ఆమెను వ్యాన్ లోకి ఎక్కించే క్రమంలో లక్ష్మీ అపర్ణ ప్రతిఘటించిన తీరు చర్చనీయాంశమైంది. దీంతో ఇప్పుడు ఈ అంశంలో పోలీసుల వైఫల్యం అంటూ మహిళా సంఘాలు నినదిస్తున్నాయి. అపర్ణకు మద్ధతుగా నిలుస్తున్నాయి. ఈ అంశంపై ఎవరి వాదాన వారు వినిపిస్తున్నారు. అయితే.. లక్ష్మీ అపర్ణపై అక్రమ కేసులు పెట్టారనేది మహిళా సంఘాల ఆరోపణ.

lakshmi aparna issue
lakshmi aparna issue

రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల తీరును ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అపర్ణపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఐద్వా రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించింది. లక్ష్మీఅపర్ణకు అన్యాయం జరిగిందని.. ఇందుకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు ఆమెపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోజు అనుమతులున్న పత్రాలు లేకపోవడం సమస్యకు కారణమైంది. ఆమెను మహిళా పోలీసులు ఈడ్చుకుని వెళ్లడం సమస్య తీవ్రతను పెంచింది. ఆమె.. దురుసు ప్రవర్తనే ఇందుకు కారణమని పైగా.. మద్యం తాగిందని పోలీసులు అంటున్నారు. పోలీసులే తనపట్ల దురుసుగా వ్యవహరించారనేది ఆమె వాదన. మొత్తానికి సున్నితంగా పరిష్కరించాల్సిన సమస్య జటిలమవుతోంది.

Read More: Lovers: 11 ఏళ్లుగా ప్రేమికుల రహస్య కాపురం..! ఒకే గదిలో.. అదే ఇంట్లో.. ఫ్యామిలీకి తెలీకుండా

విజయవాడ బార్ అసోసియేషన్ కూడా పోలీసుల తీరును ఖండించింది. రాష్ట్రంలో ఇలా మహిళలపట్ల జరిగే అన్యాయాలపట్ల మహిళా సంఘాలు ఇలానే రియాక్ట్ కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం అధికార పార్టీ ఎమ్మెల్యే ఓ మహిళా రెవెన్యూ అధికారిపై చేయి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. రాష్ట్రాన్ని కుదిపేసిన ఆ అంశంలో ప్రభుత్వం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు. మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేయలేదు. యూనివర్శిటీలో ఓ యువతి ఆత్మహత్య అంశంలో అప్పటి ప్రభుత్వం కేసును నీరుగార్చించదనే ఆరోపణా ఉంది. కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి అంశంలో కూడా మహిళా సంఘాలు, వ్యవస్థలు మరింత యాక్టివ్ అయితేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.

 

 

author avatar
Muraliak

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju