న్యూస్ రాజ‌కీయాలు

ys Jagan: అవే పంచులు.. అదే దంచుడు..! జగన్ సున్నవడ్డీ పథకం ప్రారంభం..!!

Share

ys Jagan: దుష్ట చతుష్టయం.. అనే పేరుని సీఎం జగన్ విపరీతంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు..! చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 అధినేత బీవీఆర్ నాయుడు” కలిపి తనపై, తమ ప్రభుత్వంపై బురద చల్లేలా అబద్ధాలు రాస్తున్నారని.. వీటిని నమ్మవద్దని ఈరోజు ఒంగోలులో జరిగిన సభలో ఈయన కోరారు. సున్నవడ్డీ పథకం అమలులో భాగంగా శుక్రవారం సీఎం జగన్ ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా రూ. 3615 కోట్లు మహిళల ఖాతాలకు జమ చేసారు. చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన అప్పులే కొనసాగిస్తున్నామని.. అప్పుడు లాగానే ఆదాయం ఉందని.., చంద్రబాబు అప్పుడు చేయలేనిది జగన్ నేడు చేస్తున్నాడని.. నా ఎస్సి, నా బీసీ, నా మైనారిటీ చెల్లెమ్మలు డబ్బులు ఇవ్వడం తప్పా..? అంటూ ప్రశ్నించారు. మీకు పథకాలు ఇస్తుంటే.. మీ కోసం పథకాలు అమలు చేస్తుంటే ఈ దుష్ట చతుష్టయం పదే పదే ఏపీ శ్రీలంక అయిపోతుందని రాస్తున్నారు.. అంటూ మండిపడ్డారు..!

ys Jagan : మాది చేతల ప్రభుత్వం..!!

చంద్రబాబు లాగా మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు.. మాది చేతల ప్రభుత్వమని సీఎం జగన్ పేర్కొన్నారు. వివిధ పథకాల ద్వారా మహిళలకు ఇప్పటి వరకు రూ. 36 వేల కోట్లు లబ్ది అందించినట్లు చెప్పారు. ఇటువంటి పథకాలు ఇస్తే మన రాష్ట్రం శ్రీలంక అవుతుందని రాస్తున్నారు.., ఈ పథకాలు వద్దని ఆ పత్రికలు, ఆ దత్తపుత్రుడు నిత్యం చెప్తున్నారు. ప్రజలకు మేలు చెస్ పథకాలను అమలు చేస్తూనే ఉంటామని.. ఎవరు అడ్డుకున్నా పథకాలు ఆపేది లేదని.. వారి గోబెల్స్ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసారు.


Share

Related posts

BREAKING: న్యాయరాజధానిగా కర్నూలు.. అప్పుడే పడిన తొలి అడుగు..!

amrutha

Luc Montagnier about Vaccine: వాక్సిన్ వలనే కరోనా ఈ చావులు..!? నోబెల్ విన్నర్, వైరాలజిస్ట్ సంచలన వ్యాఖ్యలు..!!

Srinivas Manem

Prabhas: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని డైలీ అడిగేవాళ్ళకి పిచ్చ క్లారిటీ ఇచ్చిన న్యూస్!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar