NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Kurnool Tour : కర్నూలులో హైకోర్టు.. చంద్రబాబుకు షాకిచ్చిన లాయర్లు..!?

lawyers shock to chandrababu in kurnool

Chandrbabu Kurnool Tour : చంద్రబాబు కర్నూలు టూర్ Chandrababu Kurnool Tour.. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి రాజధానిగా అమరావతిని తెరపైకి తెచ్చారు. 29 గ్రామాల్లోని రైతుల నుంచి భూములు తీసుకుని రాజధాని నిర్మాణం ప్రారంభించారు. 2019 ఎన్నికల సమయానికి అమరావతి ప్రాంత నిర్మాణాలు, అభివృద్ధి.. ఆయనకు ఓటమి రుచి చూపించాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు తన ఓటమికి కారణాలు అన్వేషించుకునే పనిలో ఉండగా జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. అమరావతిలో ఉద్యమాలు మొదలయ్యాయి. అయితే.. చంద్రబాబు, లోకేశ్ తోసహా ఏ టీడీపీ నాయకుడు కూడా అక్కడి రైతుల తరపున పెద్దగా పోరాడింది లేదు. విశాఖకు పరిపాలనా రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని అనవసరం అనే ప్రకటనలు తప్ప.

lawyers shock to Chandrababu Kurnool Tour in kurnool
lawyers shock to Chandrababu Kurnool Tour in kurnool

ఇదే అంశాన్ని చంద్రబాబు అండ్ టీమ్ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. విశాఖలో రాజధాని రావడం విశాఖ ప్రజలకు ఇష్టం లేదని.. కర్నూలులో హైకోర్టు రావడం అక్కడివారికి ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కర్నూలు పర్యటనకు వెళ్లారు. అక్కడ చంద్రబాబుకు న్యాయవాదుల సెగ తగిలింది. కర్నూలుకు న్యాయ రాజధాని ఎందుకు వద్దు? హైకోర్టు ఏర్పాటును మీరెందుకు అడ్డుకుంటున్నారంటూ అక్కడి న్యాయవాదులు ఆయన కాన్వాయ్ కు అడ్డు తగిలారు. ఇందుకు సీఎం జగన్ ను నిందించే ప్రయత్నం చేసి చంద్రబాబు అక్కడి నుంచి బయటపడ్డారు.

మొత్తంగా రాజధాని విస్తరణ ఎందుకు వద్దనేది డైరక్ట్ గా చంద్రబాబుకే తగిలింది. కర్నూలు హైకోర్టుకు వెళ్తే టైప్ రైటర్లు తప్పితే ఏం వస్తుందని టీడీపీ నాయకులు అన్నారు. హైటెక్ సిటీ ప్రాంతం అభివృద్ధి, అమరావతి ప్రాంతం విలువ చంద్రబాబు వల్లే అని చెప్పుకుంటారు టీడీపీ నాయకులు. మరి.. కర్నూలు, విశాఖల్లో రాజధాని ఏర్పాటైతే అక్కడ అభివృద్ధి జరగదని ఎందుకు చెప్తున్నారో వారికే అర్ధం కావాలి. మొత్తంగా చంద్రబాబుకు కర్నూలు న్యాయవాదుల సెగ తగిలినట్టే. మరి.. మున్ముందు టీడీపీ ఈ అంశాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.

author avatar
Muraliak

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju